ఓటీటీకి.. అదిరిపోయే మలయాళ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్! బుర్ర పాడు
ABN, Publish Date - Apr 09 , 2026 | 07:10 PM
గత నెల మలయాళంలో థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన మిస్టరీ థ్రిల్లరీ టైమ్ లూప్ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
గత నెల మలయాళంలో థియేటర్లలో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం సంభవం అధ్యయనం ఒన్ను (Sambavam Adhyayam Onnu). మిస్టరీ థ్రిల్లరీ టైమ్ లూప్ కథాంశం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు జిత్తు సతీశన్ మంగళతు (Jithu Satheesan Mangalathu) దర్శకత్వం వహించగా అస్కర్ అలీ (Askar Ali), వినీత్ కుమార్ (Vineeth Kumar), సిద్ధార్థ్ భరతన్ (Sidharth Bharathan), సెంథిల్ కృష్ణ (Senthil Krishna) కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
కథ విషయానికి వస్తే.. కేరళ తమిళనాడు సరిహద్దులో ఉన్న ఓ కారడవివిలోకి వెళ్లిన వారెవరూ తిరిగి రారని ఓ వార్త బాగా ప్రాచుర్యంలో ఉంటుంది. అలాంటిది ఓ రోజు తమిళనాడు పోలీస్ ఆఫీసర్ ఆ అడవిలోకి వెళ్లి కనిపించకుండా పోతాడు. ఈ విషయం తెలుసుకున్న కేరళ పోలీసులు అతన్ని వెతుక్కుంటూ ఫారెస్టులోకి వెళతారు. అక్కడ వారికి తమిళ పోలీసు ఆచూకీ లభించక పోగా వింత వింత పరిస్థితులు, అనుభవాలు ఎదురవుతుంటాయి. అంతేగాక టైమ్ సరిగ్గా నడవదు.. జరిగిన ఘటనలే మళ్లీ మళ్లీ జరుగుతన్నట్లు అనిపిస్తుంటుంది. అక్కడి నుంచి బయట పడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవి సఫలం కావు. ప్రారంభించిన దగ్గరికే తిరిగి వస్తుంటారు. చివరకు అక్కడ ఓ అదృశ్య శక్తి ఏదో ఉందని గుర్తిస్తారు.
ఈ నేపథ్యంలో ఆ పోలీసులు ఆ టైం లూప్ , అడవి నుంచి బయట పడగలిగారా లేదా ఈ క్రమంలో ఎన్ని పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వచ్చిందనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది. మూవీ ఆరంభం నుంచి చివరి వరకు ఎక్కడా బోర్ అనే మాటరానివ్వకుండా అనుక్షణం మిస్టరీ, సస్పెన్స్‌తో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుంది. వీక్షకులను అందులో లీనమయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఈ మూవీ ఏప్రిల్ 15 నుంచి జియో హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. డిఫరెంట్ జానర్ సినిమాలు ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన సినిమా ఇది. డోంట్ మిస్.