Lenin OTT: అయ్యగారి సినిమా ఈసారి ఆలస్యం కాకుండానే ఓటీటీకి..
ABN, Publish Date - Aug 01 , 2026 | 03:59 PM
అక్కినేని యంగ్ హీరో అఖిల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ‘లెనిన్’తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil Akkineni) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ‘లెనిన్’ (Lenin)తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఊరమాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. అఖిల్ గత చిత్రం ‘ఏజెంట్’ థియేటర్లలో విడుదలైన చాలా కాలం తర్వాత కూడా ఓటీటీ రిలీజ్‌కి తీవ్ర ఆలస్యం కావడం చూశాం. అయితే ఈసారి ‘లెనిన్’ విషయంలో ఆ ఊహాగానాలకు తావులేకుండా, థియేట్రికల్ రన్ ముగిసిన వెంటనే కేవలం 4 వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. తాజాగా ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ (ZEE5), ఆగస్ట్ 7వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ (Lenin Streaming Details) చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ‘లెనిన్’ మొదటి రోజు నుంచే ప్రేక్షకులను, అక్కినేని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పవర్‌ఫుల్ రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త గెటప్‌తో, తన యాక్షన్ నటనతో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించారు. అఖిల్ సరసన భామ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా అలరించగా, ఎస్. థమన్ అందించిన మాస్ బీట్స్, నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కింగ్ నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
థియేటర్లలో అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచిన ‘లెనిన్’, ఇప్పుడు బుల్లితెరపై ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. థియేటర్లలో మిస్ అయినవారు, అలాగే మళ్లీ మళ్లీ ఈ మాస్ విజువల్ వండర్‌ను ఆస్వాదించాలనుకునే అక్కినేని ఫ్యాన్స్ కోసం ఆగస్ట్ 7 నుంచి జీ5 వేదికగా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి ఆదరణను రాబట్టుకుంటుందో తెలియాలంటే మాత్రం ఆగస్ట్ 7 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇవి కూడా చదవండి:
అంజలీదేవి నుంచి సాయి పల్లవి వరకు.. వెండితెర సీతమ్మల జర్నీ!
బర్త్‌డే స్పెషల్.. ‘టాక్సిక్’ రాయల్ లుక్‌లో కియారా!
సీనియర్ నటి మంజు భార్గవితో NSR స్పెషల్ ఇంటర్వ్యూ