ఊరిలో.. టీవీ పెట్టిన చిచ్చు! ఓటీటీకి.. అదిరిపోయే వింటేజ్ ఫ్యామిలీ డ్రామా
ABN, Publish Date - May 07 , 2026 | 10:21 PM
గత నెలలో థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు సంపాదించుకున్న చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ.
గత నెలలో థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు సంపాదించుకున్న చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ (Thimmarajupalli TV). యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ. సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్లుగా వి.మునిరాజు (Muniraju)దర్శకుడిగా పరిచయం అయ్యారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొంది, 90ల నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూయించింది. దాదాపు అంతా కొత్త వారితోనే తెరకెక్కిన ఈ మూవీ మ్యూజిక్, స్టోరీ, నటీనటులు అంతా ఫర్‌ఫెక్ట్‌గా సెట్ అయి వీక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుంది.
కాగా.. ఇప్పుడు ఈ తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఆహా (Aha OTT) ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్లలో మిస్సయిన వారు, మంచి ఫ్యామిలీ సినిమా చూడాలనుకునే వారికి ఈ మూవీ మంచి ఆఫ్సన్. డోంట్ మిస్.