సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

 కిరణ్ అబ్బవరం:  కంటెంట్‌ ఏ పొద్దు బయటకు వస్తాదో తెలీదు కానీ..

ABN, Publish Date - Mar 20 , 2026 | 03:58 PM

కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ఓ సిరీస్‌ చేయబోతున్నారని కొంతకాలంగా సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది.

కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ఓ సిరీస్‌ చేయబోతున్నారని కొంతకాలంగా సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. వాటిని నిజం చేస్తూ డిజిటల్‌ డెబ్యూపై అధికారిక ప్రకటన ఇచ్చారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon Prime video) కోసం రూపొందుతున్న ‘గువ్వల చెరువు ఘాట్‌’ (Guvvala Cheruvu Ghat) వెబ్‌ సిరీస్‌లో కిరణ్‌ అబ్బవరం, సంయుక్త మీనన్‌ జంటగా నటిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్‌ రివేంజ్‌ డ్రామాగా ఈ సిరీస్‌ తెరకెక్కుతోంది. ‘డియర్‌ కామ్రేడ్‌’ ఫేమ్‌ భరత్‌ కమ్మ దీనికి (Bharat kamma) దర్శకత్వం వహిస్తున్నారు.

ఉగాది సందర్భంగా ఈ సిరీస్‌ను ప్రకటించి ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. త్వరలోనే ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని చెబుతూ కిరణ్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ‘ఈ కంటెంట్‌ ఏ పొద్దు బయటకు వస్తాదో తెలీదు కానీ వచ్చిన రోజు మాత్రం మీరంతా గర్వంగా ఫీలవుతారు’ అని పోస్టులో పేర్కొన్నారు. ‘పవర్‌, ప్రామిస్‌, పెయిన్‌కు సంబంధించిన కథ ఇద'ని మేకర్స్‌ పేర్కొన్నారు. డ్రీమ్‌ ఫార్మర్స్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్‌ ఈదర నిర్మించారు. తిరువీర్‌, తేజస్వీ రావు, సిద్థిక్‌, ఆడుకాలం నరేన్‌, వికాస్‌ దర్శన్‌, మహర్షి విద్యా, మంజు భార్గవి, వినోద్‌ కిషన్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

Updated Date - Mar 20 , 2026 | 04:57 PM