సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓటీటీకి.. మ‌రో అదిరిపోయే రియ‌ల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్‌

ABN, Publish Date - Jun 12 , 2026 | 09:15 AM

కదిర్, దివ్య భారతి జంటగా రూపొందిన నూత‌న తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లింగం.

Lingam

కదిర్ (Kathir), దివ్య భారతి (Divya Bharathi) జంటగా రూపొందిన నూత‌న తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లింగం (Lingam). బోస్ వెంక‌ట్ (BoseVenkat), సత్య, పూర్ణిమ రవి (Poornima Ravi) తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఆశయం, ద్రోహం, ప్రతీకారం అనే మూడు అంశాలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని రూపొందించారు. 1990 దశకం నుంచి 2000 వరకు దక్షిణ తమిళనాడులో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా దీనిని నిర్మించారు.

తన జీవితంలో చిన్న‌నాటి నుంచి పోలీస్ కావాల‌నే క‌లలు క‌నే ఓ యువ‌కుడు కబడ్డీ ఆటగాడిగా రంగంలోకి దిగుతాడు. క్ర‌మంగా పేరు తెచ్చుకుంటున్న స‌మ‌యంలోనే నాటకీయ పరిణామాల మధ్య ఒక హత్యా ఆరోపణ అతని జీవితాన్ని ఎలా మార్చివేసిందన్నదే క‌థ‌తో ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్, ప్రతీకార స్టోరీగా ఈ సిరీస్ తెర‌కెక్కింది.

లక్ష్మి శరవ‌ణ కుమార్, ప్ర‌శాంత్ పాండియ‌రాజ్‌ కథ సమకూర్చి దర్శకత్వం వహించారు. ఈ నెల 26 నుంచి ఈ లింగం వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ (Jio Hotstar) ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా విడుదల చేసిన తెలుగుట్రైలర్ ఆక‌ట్టుకునేలా ఉంది. మీరూ ఓ లుక్ వేయండి.

Updated Date - Jun 12 , 2026 | 09:32 AM