Annagaru Vostaru OTT: అన్నగారు.. రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేశారు
ABN, Publish Date - Jan 28 , 2026 | 07:36 AM
కార్తీ హీరోగా బేబమ్మ కృతిశెట్టి తమిళంలో కథానాయికగా ఎంట్రీ ఇస్తూ రూపొందిన చిత్రం అన్నగారు వస్తారు.
కార్తీ (Karthi)హీరోగా బేబమ్మ కృతిశెట్టి (Krithi Shetty) తమిళంలో కథానాయికగా ఎంట్రీ ఇస్తూ రూపొందిన చిత్రం అన్నగారు వస్తారు. ఈ మూవీ ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండానే సడన్‌గా డిజిటల్‌స్ట్రీమింగ్‌కు వచ్చి షాకిచ్చింది. వా వాతియర్ (Vaa Vaathiyaar) పేరుతో తమిళంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉండగా ఫైనాన్సియల్ సమస్యల వలన వాయిదా పడుతూ వచ్చింది. ఈ సంక్రాంతి సమయానికి ఆ సమస్యలు తీరడంతో హడావుడిగా తమిళ వెర్షన్ వరకు జనవరి 14న థియేటర్లలో విడుదల చేశారు కానీ ప్రేక్షకులను అలరించ లేకపోయింది. ఇప్పుడు రెండు వారాలు కూడా పూర్తవక మునుపే ఓటీటీకి వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. రామేశ్వరన్ చిన్నప్పటి నుంచి తన తాత ప్రోద్బలంతో ఎమ్జీఆర్ సినిమాలు చూసి మంచి వాడిగానే బతకాలని నిర్ణయించుకుంటాడు. అయితే పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ అయిన రామేశ్వర్ తన తాతకు తెలియకుండా లంచాలు తీసుకుంటూ డబ్బు గడిస్తుంటాడు. అయితే అనుకోకుండా ఓరోజు జరిగిన ఘటన వళ్ల తనలోని ఎమ్జీఆర్ మేల్కోంటాడు. ఈక్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎమ్జీఆర్‌కు రామేశ్వరన్, ఆయన తాతల మధ్య ఉన్న లింకేంటి, ఎవరిని కాపాడడానికి రామేశ్వరన్ అలా మారాడనేది కథ.
ఇలాంటి సినిమాలు మనం గతంలోనే చూసినా.. ఇందులో మాత్రం కార్తీ మూవీ అంతా మోస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తాడు. చాలా సన్నివేశాలలో లాజిక్‌లు ఉండవు. కృతిశెట్టి కొన్ని సీన్లలో మాత్రమే కనిపిస్తుంది. యాక్షన్ ఫర్వాలేదనిపిస్తుంది. అయితే తమిళంతో పాటే తెలుగులోనూ థియేటర్లకు రావాల్సిన ఈ చిత్రం ఇక్కడ రిలీజ్‌కు నోచుకోలేక పోయింది. ఇప్పుడు ఈ సినిమా అసలు ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ రోజు (బుధవారం, జనవరి 28) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (PrimeVideo) లో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. కార్తీ ఫ్యాన్స్ ఓ మారు సినిమాను చూడవచ్చు.