గుణశేఖర్ చిత్రం ఓటీటీలో...
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:49 PM
గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'యుఫోరియా' మూవీ ఏప్రిల్ 2 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి గుణశేఖర్ బెస్ట్ స్టోరీ రైటర్‌గా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్నారు.
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తాజా చిత్రం 'యుఫోరియా' ఫిబ్రవరి 6వ తేదీ థియేటర్లలో విడుదలైంది. మాదక ద్రవ్యాల మత్తులో యువత ఎలా తప్పుదారిలో ప్రయాణిస్తున్నారో ఈ సినిమా ద్వారా తెలియచేసే ప్రయత్నం గుణశేఖర్ చేశారు. 'ఒక్కడు' సినిమాలో హీరోయిన్‌గా నటించిన భూమిక... ఆ తర్వాత మరోసారి గుణశేఖర్ దర్శకత్వంలో ఇందులో కీలక పాత్ర పోషించారు. 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ ఈ సినిమాలో యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రను పోషించారు. గౌతమ్ వాసుదేవ మీనన్ పోలీస్ కమీషనర్‌గా నటించిన ఈ సినిమాలో పలువురు కొత్త నటీనటులు యాక్ట్ చేశారు.
నీలిమా గుణ నిర్మించిన 'యుఫోరియా' సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఏప్రిల్ 2 నుండి ఈ సినిమా ఈటీవీ విన్‌లో అందుబాటులో ఉంటుందని మేకర్స్ తెలిపారు. విశేషం ఏమంటే ఇటీవల తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులలో గుణశేఖర్ 'యుఫోరియా' సినిమాకు గానూ బెస్ట్ స్టోరీ రైటర్ అవార్డును అందుకున్నారు.