సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఓటీటీకి వ‌చ్చేస్తోన్న.. రీసెంట్ హ‌ర్ర‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్

ABN, Publish Date - Oct 25 , 2026 | 01:15 PM

ప్ర‌ముఖ త‌మిళ‌ సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్రకాష్ కుమార్, కయదు లొహర్ జంటగా నటించిన చిత్రం ఇమ్మోర్టల్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

Immortal

ప్ర‌ముఖ త‌మిళ‌ సంగీత ద‌ర్శ‌కుడు జీవీ ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar), కయదు లొహర్ (Kayadu Lohar) జంటగా నటించిన చిత్రం ఇమ్మోర్టల్ (Immortal). గ‌త నెలలో థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ఈ మూవీ ఫ‌ర్వాలేద‌ని అనిపించుకుంది. రొమాన్స్, మిస్టరీ, అతీంద్రయ శక్తుల నేప‌థ్యంలో హర్రర్ థ్రిల్ల‌ర్‌ మూవీగా వ‌చ్చిన ఈ సినిమాకు మరియప్పన్ చిన్నా (Mariyappan Chinn) దర్శకత్వం వ‌హించాడు. ఇప్పుడు ఈ మూవీ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. త‌న మామ‌య్య ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేసే మాగి అద్దె ఇంటి కోసం వెతుకుతుండ‌గా ఓ రోజు సింధు అనే యువ‌తి ప‌రిచ‌యం అవుతుంది. త‌ను ఉండే ఖ‌రీదైన అపార్ట్‌మెంట్‌లో త‌క్కువ అద్దెకు ఓ గ‌దిని ఇస్తుంది. కాల‌క్ర‌మంలో వారిరువురి న‌డుమ ప్రేమ మొద‌లై ఒక‌రినొక‌రు శారీర‌కంగా ద‌గ్గ‌ర‌య్యే వ‌ర‌కు వారి బంధం వెళుతుంది. స‌రిగ్గా అదే స‌మయంలో అ అపార్ట్‌మెంట్‌, సింధు వెన‌కాల ఓ బ‌యంక‌ర‌మైన ర‌హ‌స్యం దాగి ఉన్న విష‌యం బ‌య‌ట ప‌డుతుంది. అక్క‌డి నుంచి త‌ప్పించుకోవాల‌ని ఎన్ని మార్లు ప్ర‌య‌త్నించినా తిరిగి అక్క‌డికే వ‌స్తుంటాడు. ఈ క్ర‌మంలో మాగి అక్క‌డి నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ‌గలిగాడా లేదా ఎలాంటి ప‌రిస్తితులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌నేదే క‌థ‌.

ఒక ఊహించని సంఘటన, రహస్యమైన మహిళ, వాటి వెనుక దాగివున్న రహస్యం.. ఇలా ఎన్నో మలుపులతో ఈ సినిమా సాగుతుంది. హాలీవుడ్ స్థాయి విలువ‌ల‌తో రూపొందించిన ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఈనెల 30వ తేదీ నుంచి సోనీ లివ్ (Sony LIV)ఓటీటీలో త‌మిళంతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవ‌నుంది. హ‌ర్ర‌ర్‌, ఫాంట‌సీ చిత్రాలు ఇష్ట‌ప‌డే వారు ఈ సినిమా మంచి విందుభోజ‌నం లాంటిది.

Updated Date - Oct 25 , 2026 | 01:32 PM