సడన్‌గా.. ఓటీటీకి వచ్చేసిన హ్యాపీరాజ్! మస్ట్ వాచ్ మూవీ
ABN, Publish Date - Apr 24 , 2026 | 10:33 AM
గత నెల చివరలో థియేటర్లకు వచ్చి మంచి విజయం సాధించింన తమిల చిత్రం హ్యాపీరాజ్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
గత నెల చివరలో థియేటర్లకు వచ్చి మంచి విజయం సాధించింన తమిల చిత్రం హ్యాపీరాజ్ (Happy Raj) . మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ (G. V. Prakash Kumar) హీరోగా నటించగా తెలుగు అమ్మాయి శ్రీ గౌరీప్రియ (Sri Gouri Priya) కథానాయికగా నటించింది. చాలాకాలం తర్వాత అబ్బాస్ (Abbas) రీ ఎంట్రీ ఇవ్వగా జార్జ్ మార్యన్ (George Maryan) ప్రధాన పాత్ర పోషించాడు. మరియా రాజా ఎలాంచెజియన్ (Maria Raja Elanchezian) దర్శకత్వం వహించాడు. ఇప్పుడు ఈ చిత్రం సైలెంట్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
కథ విషయానికి వస్తే.. అందంగా లేని పొట్టివాడైనా ముత్తు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తన ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేస్తుంటాడు. కానీ ఊరి వారు మాత్రం హేళన చేస్తుంటారు. ఈ నేపథ్యంలో వారి అబ్బాయి ఆనంద్ దగ్గరి వరకు వచ్చిన పెళ్లి సంబంధాలు కట్ అవుతుంటాయి. ఇక లాభం లేదనుకున్న ఆనంద్ ఉద్యోగ నిమిత్తం సిటీకి వెళ్లి సదరు కంపెనీ ఓనర్ కూతురు కావ్యతో ప్రేమలో పడి ఇరువురి పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వస్తారు. తీరా ఎంగేజ్‌మెంట్ సమయంలో ఆనంద్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడకు రావడం, ఆయన రూపు రేఖలు చూసి తన స్టేటస్‌కు సరిపోరు అంటూ కావ్య తండ్రి రాజీవ్ ఆసహ్యించుకుంటాడు. ఈ క్రమంలో ఇరువురి పేరెంట్స్ ఒకరికొకరు అవమానించుకుంటారు.
అయితే.. ఎంగేజ్‌మెంట్ సమస్య తర్వాత విడిపోయిన ఆనంద్, కావ్య తిరిగి కలుసుకుని తమ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకొవాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో కావ్య తన ఫ్యామిలీతో ఆనంద్ ఊరికి వెళతారు. మరి అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, వాళ్లంతా కలిసి పోయారా లేదా ఆనంద్ తండ్రి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, రాజీవ్ ఎవరి సాయంతో అంత స్థాయికి ఎదిగాడనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది.
ఎక్కడా బోర్ అనే ఫీల్ రాకుండా ఔట్ అండ్ ఔట్ కామెడీతో, హృదయాన్ని అత్తుకునే ఎమోషనల్ సన్నివేశాలతో మూవీ మొదటి నుంచి చివరి వరకు అలరిస్తుంది. ముఖ్యంగా తండ్రీకొడుకుల సెంటిమెంట్ సినిమాకు మెయిన్ హైలెట్. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మిస్సయిన వారు మంచి ఫ్యామిలీ ఎమోషన్ సినిమా చూడాలనుకునే వారికి ఈ చిత్రం బెస్ట్ ఆఫ్సన్