ఎట్ట‌కేల‌కు ఓటీటీకి ర‌వితేజ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా

ABN , Publish Date - Mar 13 , 2026 | 10:55 AM

ర‌వితేజ రీసెంట్‌ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి చిత్రం ఎట్ట‌కేల‌కు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

Ravi Teja

ర‌వితేజ (Ravi Teja), ఆషికా రంగ‌నాథ్ (Ashiki Ranganath), డింపుల్ హ‌య‌తీ (Dimple Hayathi) కాంబినేష‌న్‌లో కుటుంబ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల (Kishore Tirumala) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi). సంక్రాంతి పండుగ‌ను పురస్క‌రించుకుని జ‌న‌వ‌రి 13న థియేట‌ర్ల‌కు వ‌చ్చిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. దీంతోపాటు రిలీజ్ అయిన 'ది రాజాసాబ్‌, నారీ నారీ న‌డుమ మురారి, మ‌న శంక‌ర్ వ‌ర ప్ర‌సాద్‌ గారు, అన‌గ‌న‌గా ఒక రాజు' వంటి చిత్రాలు నెల రోజుల క్రిత‌మే ఓటీటీకి రాగా ఈ చిత్రం మాత్రం చాలా ఆల‌స్యంగా స్ట్రీమింగ్‌కు వ‌చ్చింది.

ఈ చిత్ర క‌థ విష‌యానికి వ‌స్తే.. రామ సత్యనారాయణ (రవితేజ), బాలామణి (డింపుల్ హయతీ) చాలా అన్యోన్య దంప‌తులు. వీరిద్ద‌రు క‌లిసి ఓ బేవరేజ్ కంపెనీ నడుపుతుంటారు. వాళ్ళు కొత్తగా త‌యారు చేసిన‌ ప్రొడక్ట్ అనార్కలి కోసం స్పెయిన్‌లో ఉన్న మరో ఇంటర్నేషనల్ బేవరేజ్ కంపెనీతో టై అప్‌కు ప్ర‌య‌త్నిస్తే అది రిజక్ట్ అవుతుంది. దీంతో దానికి కారణం తెలుసుకోవడానికి రామ్ స్పెయిన్ వెళతాడు. అక్క‌డ‌ కంపెనీ ఓనర్ మానసా శెట్టి (ఆషికా రంగనాథ్)ను కలిసి వారికున్న ఇష్యూను గుర్తించి, త‌ర్వాత‌ త‌న అనార్కలి బ్రాండ్ ప్రమోషన్ విషయంలో సక్సెస్ అవుతాడు. అయితే.. ఈ క్రమంలో రామ్ అనుకోకుండా మానసకు శారీరకంగా దగ్గరై పోతాడు. ఈ విషయాన్ని అక్కడతో వదిలేయాలని ఇద్దరూ అనుకుంటారు.

HDQSkbiaMAAsu3q.jfif

తిరిగి ఇండియా వచ్చిన రామ్ బిజినెస్ ప‌నుల్లో బిజీగా గ‌డుపుతుంటాడు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో త‌న కంపెనీ ప‌ని నిమిత్తం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన మాన‌స, రామ్‌ను క‌లుస్తుంది. 'నా మొగుడు నాకే సొంతం' అని భావించే బాలామణికి, రామ్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న మానసకు మధ్య అతనెలా నలిగిపోయాడన్నదే ఈ సినిమా మిగిలిన‌ కథ. అయితే.. ఇప్ప‌టికే ఇలాంటి నేప‌థ్యంలో మ‌నం డ‌జ‌న్ల కొద్ది సినిమాలు చూసేశాం. దీనిని వాటికి కాస్త భిన్నంగా తీసుకుని వెళ్లే ప్ర‌య‌త్నం దర్శకుడు చేసినా, అదంతగా స‌ఫ‌లీకృతం కాలేదు.

చాలా సంద‌ర్భాల్లో పాత సినిమాల స‌న్నివేశాలే గుర్తుకు వ‌చ్చి జ‌ర‌గ‌బోయేది ముందే ఊహించ‌ గ‌లుగుతాం. అయితే ద‌ర్శ‌కుడి ర‌చ‌న‌, పంచ్‌ డైలాగ్స్ కొత్తగా ఉండి, ఎక్క‌డా బోర్ అనిపించ‌దు. ఇప్పుడీ చిత్రం జీ 5 ( Zee5) ఓటీటీలో తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ‌స్ట్ హాఫ్ లో కాస్త ఎక్స్‌పోజింగ్ ఉన్నా, సినిమాను ఫ్యామిలీతో చూసేయ‌వ‌చ్చు. ఆషికా రంగ‌నాధ్ అందాలు ఈ సినిమాకు మెయిన్ హైలెట్‌.

Updated Date - Mar 13 , 2026 | 12:12 PM