డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు..
ABN , Publish Date - Feb 23 , 2026 | 08:42 PM
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ని మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో..
రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్‌కి పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది. నేను ఇప్పటి వరకు ఎన్నో రకరకాల పాత్రల్ని పోషించాను. అయితే ఈ సిరీస్‌లో చేసిన కారెక్టర్ మాత్రం మైల్ స్టోన్‌లా నిలుస్తుంది. ఇందులోని నా మాడ్యులేషన్, పాత్ర తీరు, డైలాగ్స్ అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. డైరెక్టర్ కృష్ణ నన్ను చాలా కొత్తగా చూపించారు. ఫిబ్రవరి 27న మా సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోన్న ఏ ఒక్కరినీ నిరాశ పర్చదు.. బోలెడన్ని ట్విస్టులు కూడా ఉంటాయి. ఉదయ భాను గారితో నేను చేసిన ప్రతీ ప్రాజెక్ట్ హిట్ అయింది. ఈ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.
నిర్మాత కె.వి. శ్రీరామ్ మాట్లాడుతూ 'ప్రసాద్ రావు పాత్రలో రాజీవ్ ఇమిడిపోయారు. ఉదయ భాను పోషించిన కారెక్టర్ ఎంతో బాగుంటుంది. ప్రతీ ఒక్క తండ్రికి కనెక్ట్ అయ్యే సిరీస్ ఇది. ప్రతీ ఒక్క ఎపిసోడ్ క్లైమాక్స్‌లా ఉంటుంది. చివరి వరకు థ్రిల్ మెయింటైన్ చేసేలా ఉంటుంది' అని అన్నారు.
దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ 'నా దగ్గర మొదట ఓ లైన్ మాత్రమే ఉండేది. అది జయంత్ గారి దగ్గరకు వెళ్లడంతో పూర్తి కథగా మారింది. ఈ స్టోరీ మొత్తం రాయడానికి నాకు రెండేళ్లు పట్టింది. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
ఉదయ భాను మాట్లాడుతూ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్ షూటింగ్ వేగంగా పూర్తి చేశాం. కథకు, కారెక్టర్‌కు ఎంతో కనెక్ట్ అయ్యాను. పోలీస్ ఆఫీసర్ రోల్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో ఉండేది. ఓ తల్లిగా ఈ పాత్రకు ఎంతో కనెక్ట్ అయ్యాను. ప్రతీ కుటుంబం, ప్రతీ పేరెంట్, ప్రతీ కూతురు చూడాల్సిన సిరీస్. ఇప్పుడున్న సమాజానికి ఈ సిరీస్ ఎంతో అవసరం' అని అన్నారు
నటి వాసంతిక మాట్లాడుతూ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ రెండు ఎపిసోడ్స్ చూసిన వారంతా కూడా నా పర్ఫామెన్స్ గురించి గొప్పగా చెబుతున్నారు. కృష్ణ గారి వల్లే నేను అలా నటించ గలిగాను. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన జీ5 టీంకి, శ్రీరామ్ గారికి థాంక్స్. రాజీవ్ కనకాల గారితో కూతురిగా నాకు ఇది రెండో ప్రాజెక్ట్. ఉదయ భాను గారి పాత్ర పవర్ ఫుల్‌గా ఉంటుంది. గాయత్రి భార్గవి గారి పాత్ర బాగుంటుంది. మా ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ టీంని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.