సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Verity OTT: స‌డ‌న్‌గా ఓటీటీకి.. లేటెస్ట్ హాలీవుడ్ ఎరోటిక్ థ్రిల్ల‌ర్‌! తెలుగులోనూ

ABN, Publish Date - Oct 29 , 2026 | 03:26 PM

కుర్ర‌కారుకు నిద్ర‌ లేకుండా చేయ‌డానికి చాలా రోజుల త‌ర్వాత ఓ హాలీవుడ్ ఎరోటిక్ థ్రిల్ల‌ర్ ఓటీటీకి వ‌చ్చేసింది.

Verity OTT

చాలా రోజుల త‌ర్వాత హ‌లీవుడ్ నుంచి ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చిన‌ ఎరోటిక్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ వెరిటీ (Verity). చిలిపి కుర్రాళ్ల క‌లల రాణి డ‌కోటా జాన్స‌న్ (Dakota Johnson) మెయిన్‌లీడ్ రోల్‌లో న‌టించ‌గా, అన్నే హాత్వే (Anne Hathaway), జోష్ హార్ట్‌నెట్, ఇస్మాయిల్ క్రజ్ కోర్డోవా, బ్రాడీ వాగ్నర్ వంటి న‌టులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌ముఖ అమెరిక‌న్ ర‌చ‌యిత్రి మార్గరెట్ కోలీన్ హూవర్ (Margaret Colleen Hoover) ర‌చించిన‌ ప్ర‌ఖ్యాత న‌వ‌ల వెరిటీ ఆధారంగా ద‌ర్శ‌కుడు మైఖేల్ షోవాల్టర్ (Michael Showalter) ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. సుమారు 40 అమెరిక‌న్ మిలియ‌న్ డాల‌ర్ల (381 కోట్లు) వ్యయంతో రూపొందిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 2న సైలెంట్‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద క‌న‌క వ‌ర్షం కరిపిస్తోంది. దాదాపు 164 మిలియ‌న్ డాల‌ర్ల‌ను (1,560.58 కోట్లు) రాబ‌ట్టి సంచ‌ల‌నం న‌మోదు చేసింది. అలాంటి ఈ చిత్రం థియేట‌ర్ల‌లో ఉండ‌గానే ఇప్పుడు సడ‌న్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. ర‌చ‌యుత్రిగా పేరు తెచ్చుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న లోవెన్ ఆష్లీ ఒక ర‌చ‌యిత్రి. అప్ప‌టికే కొన్ని పుస్త‌కాలు రాసిన‌ప్ప‌టికీ అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేక పోతుంది. ఎలాగైనా స్టార్ రైట‌ర్ స్టేట‌స్ తెచ్చుకోవాల‌ని ఆశ‌యంగా పెట్టుకుంటుంది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా విశేష ఆద‌ర‌ణ ఉన్న‌ వెరిటీ క్రాఫోర్డ్ అనే ర‌చ‌యిత్రి అనుకోకుండా ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డి క‌ద‌ల లేని ప‌రిస్థితిలోకి వెళుతుంది. దీంతో ఆమె స‌గంలో వ‌దిలేసిన ఓ న‌వ‌లా సిరీస్‌ను పూర్తి చేయాలంటూ ఒక ప్రముఖ ప్రచురణ సంస్థ నుంచి అనూహ్యమైన అవకాశం రావ‌డంతో లోవెన్‌ అంగీక‌రిస్తుంది. ఆపై వెరిటీ ఇంటికి వెళ్లిన లోవెన్‌కు వెరిటీ రాసుకున్న ఆత్మ‌క‌థ పుస్త‌కం దొరుకుతుంది. అందులో పిల‌ల్ల మ‌ర‌ణం వెనుక సీక్రెట్స్‌, భ‌ర్త‌తో ఆమెకు ఉన్న ర‌హ‌స్యాలు తెలుస్తాయి. ఆ త‌ర్వాత జ‌రిగే హ‌త్య‌తో క‌థ మ‌రో మ‌లుపు తిరుగుతుంది. చివ‌ర్లో వెరెటీ లేఖతో మ‌రికొన్ని విష‌యాలు బ‌య‌ట ప‌డుతాయి. ఇంత‌కు ఆ ఆత్మ‌క‌థ‌లో ఎలాంటి విష‌యాలు ఉన్నాయి? అవి నిజ‌మేనా? చివ‌ర‌కు ఏమైందనే ఆస‌క్తిక‌ర‌మైన థ్రిల్లింగ్‌, రొమాంటిక్ స‌న్నివేశాల‌తో ఉత్కంఠభరితంగా సాగుతుంది.

ఆ మ‌ధ్య వ‌చ్చిన సిడ్నీ స్వీనీ ది హోమ్ మెయిడ్ సినిమా త‌ర‌హాలోనే ఇప్పుడు ఈ వెరిటీ సినిమా కూడా నార్మ‌ల్‌గా ప్రారంభ‌మై క్ర‌మంగా క‌థ‌లో లీన‌మ‌య్యేలా చేస్తుంది. 117 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఆద్యంతం ఊహించ‌ని ట్విస్టుల‌తో సాగుతూ క్లైమాక్స్ ట్విస్టుతో మ‌తి పొగొడుతారు. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో రెంట్ ప‌ద్ద‌తిలో తెలుగులోనూ అందుబాటులోకి వ‌చ్చింది. కొన్ని థ‌ర్డ్ పార్టీ యాప్‌ల‌లో ఫ్రీగా స్ట్రీమింగ్‌ అవుతోంది. సినిమాలో రొమాంటిక్ సినిమాలు అధికంగానే ఉంటాయి. చాలాకాలంగా మంచి ఎరోటిక్ సినిమా చూడాల‌నుకునే వారిక ఈ ఫిలిం ఫుల్ మీల్స్ పెడుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పిల్ల‌లు, ఆడ‌వారు లేని స‌మ‌యంలో మాత్ర‌మే ఈ వెరిటీ (Verity) చిత్రం చూడ‌డం ఉత్త‌మం. లేకుంటే మీరు అడ్డంగా బుక్ అవ‌డం ఖాయం.

Updated Date - Oct 29 , 2026 | 04:13 PM