శంకర వర ప్రసాద్.. ఓటీటీకి వచ్చేశాడు
ABN, Publish Date - Feb 11 , 2026 | 06:29 AM
సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ఎదుటకు వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ఎదుటకు వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన చిరంజీవి (Chiranjeevi) మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. వరుస పరాజయాల తర్వాత అనీల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మెగా అభిమానుల ఆకలి తీర్చింది. అంతేగాక ఈ ఏడాది తొలి విజయం నమోదు చేసుకున్న సినిమాగా నిలిచింది. ప్రంచ వ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త రికార్డులు నెలకొల్పింది.
కథ ఏంటంటే.. సెంట్రల్ మినిస్టర్ నితిన్ శర్మ (శరత్ సక్సేనా) వద్ద పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేస్తుంటాడు శంకర వర ప్రసాద్. అతని చేతిలో మంచి టీమ్ ఉంటుంది. ఎప్పుడు సరదాగా మట్లాడుకుంటూ, పంచులు వేసుకుంటూ వారి పని వారు సీరియస్‌గా చేసుకుంటుంటారు. అయితే పైకి ఆనందంగా కనిపించే శంకర్ జీవితంలో ఓ బాధ ఉంటుంది. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆయన పెద్ద వ్యాపారవేత్త కూతురు శశిరేఖ ఒకరికొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకుంటారు.
కానీ.. కొన్నాళ్లకు శశిరేఖ తండ్రి పన్నాగం వళ్ల ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుని దూరంగా నివసిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పిల్లలు, భార్యకు దూరంగా ఉండలేక వారిని తిరిగి తన వద్దకు తీసుకురావాలని తాపత్రయ పడుతుంటారు. ఈ నేపథ్యంలో తన కుటుంబానికి దగ్గరయ్యేందుకు శంకర్ ఏం చేశాడు, మామకు ఎలా బుద్ది చెప్పాడు, పిలల్లకు ఎలా దగ్గరయ్యాడనేదే కథ.
నిజం చెప్పాలంటే.. ఇలాంటి కథలు మనం ఇప్పటికే చాలా చూసి ఉన్నాం ఈ మూవీ కూడా ఆ కోవకు చెందిందే. అయితే అనీల్ టేకింగ్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లిపోయాడు. చిరంజీవి టైమింగ్‌కు అనీల్ కామెడీ తోడై సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ముఖ్యంగా చిరంజీవిని వింటేజ్ లుక్‌లో చూయించి ఫ్యాన్స్‌కు 80, 90ల నాటి చిరంజీవిని గుర్తుకు చేశారు. ఎక్కడా అశ్లీలత, అసభ్యత లేకుండా సాగిన ఈ మూవీ ఇప్పుడు జీ5 (Zee 5) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్‌లో మిస్సయిన వారు , చిరు ఫ్యాన్స్ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసి చూడాల్సిన చిత్రం ఇది. డోంట్ మిస్.