సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Aha: చెఫ్ మంత్ర... జీవన్ స్థానంలో నందినీ రెడ్డి!

ABN, Publish Date - Sep 09 , 2026 | 01:44 PM

ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతున్న 'చెఫ్‌ మంత్ర' రియాలిటీ షోకు సుమ, జీవన్‌ జడ్జీలుగా ఉన్నారు. అయితే ఇప్పుడు జీవన్‌ స్థానంలోకి నందినీరెడ్డి వచ్చారు. సెప్టెంబర్ 10 నుంచి ఈ కార్యక్రమం మొదలు కాబోతోంది.

Chef Mantra Team

ఆహా ఓటీటీ సూపర్ హిట్ వంటల కార్యక్రమం చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 6 లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ, డైరెక్టర్ నందినీ రెడ్డి జడ్జ్ లు గా వ్యవహరిస్తున్నారు. ఫన్, ఫుడ్, ఎంటర్ టైన్ మెంట్‌తో సాగే 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6' సరదా మాటలతో, రుచికరమైన వంటలతో వ్యూయర్స్ లో జోష్ నింపబోతోంది. సెప్టెంబర్‌ 10వ తేదీ రాత్రి 7 గంటలకు 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6' ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు, ఆహాలో 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6' సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండనుంది.


ఈ సందర్భంగా ఆహా ఓటీటీ అధికార ప్రతినిధి కవిత మాట్లాడుతూ, 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె మొదలుపెట్టినప్పుడు ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదు. ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా ఆరో సీజన్ కు చేరుకోవడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులంతా ఈ షోను ఎంజాయ్ చేయొచ్చు. సుమ, నందినీ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు చూస్తారని ఆశిస్తున్నా. పాత్ బ్రేకింగ్ షోస్ ను వ్యూయర్స్ కు అందించడంలో ఆహా ముందుంటోంది' అని అన్నారు. షో క్రియేటర్ నితిన్ మాట్లాడుతూ, 'మేం ఏ షో చేసినా ఎంజాయ్ చేస్తూ నిర్వహిస్తాం. 14 ఏళ్లుగా మా జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. సుమ, నందినీ, ఆహా లేకుంటే ఈ షో ఇంత బాగా వచ్చేది కాదు. పార్టిసిపెంట్స్ అందరికీ థ్యాంక్స్. ఈ సారి మాతో పాటు శ్రీపాద కూడా క్రియేటర్ గా వర్క్ చేశారు. మాకు సపోర్ట్ గా నిలుస్తున్న ఆహాకు థ్యాంక్స్' అని అన్నారు.

డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ, 'నేను రియాల్టీ షోస్ చూడటం తక్కువ. నితిన్, భరత్ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్లు రియాల్టీ షోస్ లో రాజమౌళి లాంటి వాళ్లని తెలిసింది. అరవింద్ గారు, సుమ గారి వల్లే ఈ షో కు వచ్చాను. ఇది నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్. నేనే వీళ్లందరిలో జూనియర్ ను. నాకు రోజూ కొత్త విషయాలు నేర్పిస్తూ షో లో పాల్గొనేలా చేస్తున్నారు. మా కంటెస్టెంట్స్ చేసే రెసిపీలు, వేసే పంచ్ లు, సరదా మాటలు... అన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. సుమ గారితో కలిసి ఈ షో చేయడం చాలా హ్యాపీగా ఉంది' అని అన్నారు. యాంకర్ సుమ మాట్లాడుతూ, 'గత ఐదు సీజన్స్ లో ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఆరో సీజన్ కు కూడా నేనే ఆ బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఈసారి నాతో పాటు నందినీరెడ్డి గారిని తీసుకొచ్చాను. ఆమె 'నేను ఈ షో చేయలేను చెప్పినా, మీరు చేయగలరు' అని ఒప్పించి తీసుకొచ్చాను. ఈ షోలో వంటలు చేసే కంటెస్టెంట్స్ కు ఏమాత్రం వంటలు తెలియవు. అలాంటి వారినే కావాలని సెలెక్ట్ చేస్తున్నారు. ఇక మా చెఫ్ మంత్రను యూఎస్ లో తెలుగు వారికి చేర్చిన ఘనత రామ్మోహన్, కవిత, హరిప్రియ, శ్రావణికు దక్కుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి కంటెస్టెంట్ కు హార్టీ కంగ్రాట్స్ చెబుతున్నాను' అని అన్నారు. షో క్రియేటర్ భరత్, కంటెస్టెంట్లు కావ్య , అర్జున్ అంబటి , రీతు చౌదరి తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

Karunas: ఇప్పుడు నాకు పెద్దగా మార్కెట్ లేదు! కానీ నాతో సినిమాకు రూ.7 కోట్లు ఖర్చు చేశారు

గురు స్వాములు, మాల ధారుల‌ను అవ‌మానిస్తారా.. అయ్యప్ప భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

YouTuber Nandana: బిగ్‌బాస్ కోసం హైదరాబాద్‌కు.. అనూహ్యంగా అరెస్ట్?

Updated Date - Sep 09 , 2026 | 03:04 PM