HANGMAN: డైరెక్ట్ ఓటీటీకి.. బ్రహ్మాజీ రియలస్టిక్ మిస్టరీ థ్రిల్లర్! ఎప్పటి నుంచంటే?
ABN, Publish Date - Jun 30 , 2026 | 06:51 PM
సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) లీడ్ రోల్‌లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం హ్యాంగ్‌మాన్.
సీనియర్ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) లీడ్ రోల్‌లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం హ్యాంగ్‌మాన్ (HANGMAN). వినయ్ నల్లకడి, బన్నీ అభిరామ్, రామారావ్ జాదవ్, సన్నీ ఇతర పాత్రల్లో నటించగా విహాన్ (Vihaan) దర్శకత్వం వహించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు ముస్తాబయింది.
తెలుగులో.. కంటెంట్ బేస్ చిత్రాలు చాలా అరుదుగా వచ్చే విషయం అందరికీ తెలిసిందే. ఆ కోవలో వచ్చిన మూవీనే హ్యాండ్‌మ్యాన్. ప్రభుత్వాలు విధించే ఉరిశిక్షలను అమలు మరిచే ఓ తలారి జీవిత సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తాజాగా విడుదల చేసిన ట్రైలర్ వీక్షిస్తే అర్ధం అవుతోంది. కాగా.. ఈ సినిమా జూలై 3నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది.