సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OTT: స‌డ‌న్‌గా ఓటీటీకి వ‌చ్చేసిన.. లేటేస్ట్ ర‌స్టిక్ యాక్ష‌న్ డ్రామా

ABN, Publish Date - Aug 28 , 2026 | 07:28 AM

దసరా దీక్షిత్ శెట్టి, యుక్తి తరేజా, శశి ఓదెల ప్రధాన పాత్రల్లో నటించిన రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కేజేక్యూ (కింగ్ జాకీ క్వీన్) స‌డ‌న్‌గా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

KJQ

దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ( Dheekshith Shetty), యుక్తి తరేజా (Yukti Thareja), శశి ఓదెల (Shashi Odela) ప్రధాన పాత్రల్లో నటించిన రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కేజేక్యూ (KJQ) (కింగ్ జాకీ క్వీన్). పుష్క‌రం కింద‌ట కింగ్ నాగార్జున‌తో కేడీ వంటి అల్ట్రా స్టెలిష్ యాక్ష‌న్ సినిమాను తెర‌కెక్కించిన కిర‌ణ్ కుమార్ (KK) (Kiran Kumar) దర్శకత్వం వహించాడు. అయితే ఎంతో భవిష్యత్తు ఉన్న కేకే గతేడాది అకస్మాత్తుగా మరణించడం సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన దర్శకత్వం వహించిన చివరి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి మరియు భావోద్వేగం నెలకొన్నాయి. అంతేకాదు ప్ర‌స్తుతం అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ సినిమాల‌తో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా.. కిర‌ణ్ శిష్యుడే కావ‌డం విశేషం. ఆగస్టు 7న థియేట‌ర్ల‌కు వ‌చ్చి జ‌నాల‌ను అంత‌గా ఆక‌ట్టుకోలేక పోయిన ఈ మూవీ ఇప్పుడు స‌డ‌న్‌గా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

క‌థ విష‌యానికి వ‌స్తే.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న పార్థ (దీక్షిత్ శెట్టి) ఓ అనాధ. అతన్ని చిచ్చా చేరదీసి పెద్ద డాన్‌గా తీర్చిదిద్దుతాడు. అలానే అనాధ అయిన జాకీ (శశి ఓదెల) పార్థకి దగ్గరవుతాడు. వీరిద్దరూ కలిసి స్కెచ్ వేస్తే ఎంతటి మనిషినైనా లేపేయడమే. అలా తక్కువ కాలంలోనే ఈ గ్యాంగ్ హైదరాబాద్ మొత్తం మీద పెత్తనం చెలాయించే స్థాయికి వెళుతుంది. ఈ క్రమంలో పార్థ క‌న్ను హీరోయిన్ భార్గవి (యుక్తి తరేజా)పై పడుతుంది. కానీ హీరోయిన్ మాత్రం అతన్ని ప్రేమించడానికి ఒప్పుకోక పోవ‌డంతో పార్థ ఆమెను చంపేందుకు రెడీ అవ‌తాడు.

అయితే ఆమెను చంపడానికి వెళ్లిన జాకీ ఆమెను చంపాడా లేదా? చివరికి ఏం జరిగింది? ఇద్దరు స్నేహితులు.. బద్ద శత్రువులుగా ఎలా మారారు..? ఒకరినొకరు చంపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది..? వారిద్దరి మధ్యలో హీరోయిన్ పాత్ర ఏంటి? ఆ హీరోయిన్ అసలు ఎవరు అనేదే ఈ మూవీ స్టోరి. 'న్యాయము అన్యాయము మనకు లేవు.. మనం వేటాడాలి లేకపోతే వేటాడబడతాం, బయట విలనే హీరో అనే బలమైన డైలాగులతో కేకే ఈ సినిమాను ఎంత రా అండ్ రస్టిక్‌గా తీర్చిదిద్దాడు. అయితే సినిమా అంతా రెగ్యుల‌ర్ రొటీన్ డ్రామాగా సాగడం సినిమాకు ప్ర‌ధాన మైన‌స్‌. కాగా ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో తెలుగుతో పాటు ఇత‌ర ప్ర‌ధాన భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Updated Date - Aug 28 , 2026 | 07:32 AM