బ్లాస్ట్.. ఓటీటీలో కూడా బ్లాస్టే
ABN , Publish Date - Jun 27 , 2026 | 04:00 PM
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Arjun Sarja), టాలెంటెడ్ బ్యూటీ ప్రీతీ ముకుందన్ (Preethi Mukundhan), సీనియర్ నటి అభిరామి (Abhirami) కీలక పాత్రల్లో నటించిన మోస్ట్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా బ్లాస్ట్ (Blast).
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా (Arjun Sarja), టాలెంటెడ్ బ్యూటీ ప్రీతీ ముకుందన్ (Preethi Mukundhan), సీనియర్ నటి అభిరామి (Abhirami) కీలక పాత్రల్లో నటించిన మోస్ట్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా బ్లాస్ట్ (Blast). సుభాష్ కె రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 27న గ్రాండ్‌గా విడుదలై థియేటర్లలో మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. దాదాపు నెల తరువాత బ్లాస్ట్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. కొన్ని సినిమాలు థియేటర్ లో హిట్ అయినా.. ఓటీటీలో ఆశించిన ఫలితాన్ని అందుకోవు. కానీ, బ్లాస్ట్ మాత్రం ఓటీటీలో కూడా పేలుతోంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో రీసెంట్‌గా స్ట్రీమింగ్ అవుతున్న బ్లాస్ట్ సినిమా, డిజిటల్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటూ వ్యూస్ పరంగా దూసుకుపోతోంది. సినిమాలో అర్జున్ సర్జా తన మార్క్ యాక్షన్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించగా, అభిరామి తన నటనతో సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచారు. అయితే వీరందరి కంటే ముఖ్యంగా ఈ సినిమాలో ప్రీతీ ముకుందన్ నటనకు ప్రేక్షకులు, ఫ్యాన్స్ పూర్తిగా ఫిదా అవుతున్నారు. ఎంతో ఎమోషనల్ అండ్ చాలెంజింగ్ రోల్‌లో ఆమె చూపించిన హావభావాలు సినిమాలోని చాలా సీన్లను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్ సినిమాల లిస్ట్‌లో బ్లాస్ట్ కొనసాగుతోంది. మంచి యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు రవి బసూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.
కథ విషయానికోస్తే.. రాజారామ్ ఒక కరాటే మాస్టర్. ఆయన కుటుంబంలో అందరూ కరాటే నేర్చుకున్నవారే. ఆయన కూతురు నీల కూడా కరాటేలో అన్నీ మెళుకువలు నేర్చుకుంటుంది. చిన్నప్పుడు తన తండ్రి.. తప్పు అనిపించినప్పుడు ఎవ్వరైనా సరే ఎదురుతిరగాలి అన్న మాటను మనసులో పెట్టుకున్న నీల.. ఎక్కడ తప్పు జరిగినా ముందు ఉంటుంది. దీని వలన తనకు పెళ్లి కాదేనేమో అని తల్లి భయపడుతూ ఉంటుంది. అలా అనుకోకుండా నీల.. ఒక మాఫియా గ్యాంగ్ లో వ్యక్తిని కొడుతుంది. ఆ తరువాత రాజారామ్ కుటుంబం ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది.. ? ఆ మాఫియా గ్యాంగ్ కి కావాల్సింది ఎంటి.. ? రాజారామ్ తన కుటుంబాన్ని ఆ గ్యాంగ్ నుంచి కాపాడుకున్నాడా.. ? అనేది సినిమాలో చూడాల్సిందే. మరి బ్లాస్ట్ ఓటీటీలో కూడా రికార్డ్ సృష్టిస్తుందేమో చూడాలి.