మిస్టికల్‌ థ్రిల్లర్‌గా 'పోచమ్మ'

ABN , Publish Date - Apr 13 , 2026 | 02:46 PM

బిగ్ బాస్‌ ఫేమ్‌ అంబటి అర్జున్ ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సీరిస్ 'పోచమ్మ'. ఈ నెల 17 నుండి ఆహాలో స్ట్రీమింగ్‌ కాబోతున్న దీనికి ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.

Pochamma Web Series

అంబటి అర్జున్, శ్రీపూజారెడ్డి, స్నేహల్‌ కీలక పాత్రలు పోషించిన వెబ్ సీరిస్ 'పోచమ్మ'. ఈ మిస్టికల్‌ థ్రిల్లర్‌ ఈ నెల 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కాబోతోంది. అయితే ఈ ఓటీటీ గోల్డ్ సబ్ స్క్రైబర్స్ 24 గంటల ముందుగానే ఈ వెబ్ సీరిస్‌ను చూసే ఆస్కారం లభిస్తోంది. రమేశ్‌ ఇంద్ర దర్శకత్వంలో శ్రుతినాయుడు ఈ వెబ్ సీరిస్‌ను నిర్మించారు.


తాజాగా విడుదలైన 'పోచమ్మ' ట్రైలర్‌ విషయానికి వస్తే, 'చుట్టూ అడవులు ఉన్న ఆహ్లాదకరమైన ప్రాంతంలో అందమైన ఇళ్లు ఉంటుంది. ఆ ఇంటి ముందే పోచమ్మ తల్లికి చిన్నగుడి కట్టి పూజిస్తుంటారు. ఆ ప్రాంతాన్ని, ఆ ఇంటిని పోచమ్మ తల్లి కాపాడుతుంటుంది. అలాంటి తల్లి గుడిని, ఆమె విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకుంటుందా, ఆ తప్పులు చేసిన వారిని పోచమ్మ తల్లి ఎలా శిక్షించింది? అనేది ట్రైలర్ లో ఆద్యంతం రోమాంచితంగా చూపించారు. ఒక యువ జంట ప్రేమ కథ, వారి ప్రేమకు అడ్డుపడే వ్యక్తులను ట్రైలర్ లో పరిచయం చేశారు. తను ఇష్టపడిన ఇంటికి, ఆ ప్రాంతానికి పోచమ్మ తల్లి తిరిగి రావడాన్ని చూపిస్తూ ట్రైలర్ ను ఆసక్తికరంగా ముగించారు. ఇలా థ్రిల్లింగ్, డివైన్ ఎలిమెంట్స్ తో ఈ సీరిస్‌ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.

Updated Date - Apr 13 , 2026 | 02:46 PM