‘అగధ’ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎందులో అంటే
ABN , Publish Date - Sep 18 , 2026 | 10:11 PM
సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు (MS Raju) తెరకెక్కించిన తాజా డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సయింది.
సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు (MS Raju) తెరకెక్కించిన తాజా డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ ‘అగధ’ (Agadha). కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ఆగస్ట్‌లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను అందుకుంది. ఎంఎస్ రాజు మార్క్ సస్పెన్స్ నరేషన్, నాని చమిడిశెట్టి విజువల్స్, రాకేష్ వెంకటాపురం అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను హిట్ ట్రాక్‌లో నిలబెట్టాయి. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ డివైన్ బ్లాక్‌బస్టర్ మూవీ.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’ (ZEE5)లో సెప్టెంబర్ 25 నుంచి ‘అగధ’ గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.
ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla)తో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, సీనియర్ నటుడు భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెప్పించారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. థియేటర్లలో అదిరిపోయే ట్విస్టులతో సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకున్న ‘అగధ’, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు వచ్చే వారం సెప్టెంబర్ 25 నుంచి జీ5 వేదికగా ఈ డివైన్ థ్రిల్లర్‌ను వీక్షించవచ్చు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు గ్రామంలో ఉండే మహాదేవి (కామాక్షి భాస్కర్ల) దెయ్యం పట్టిన వారిని మామూలు మనుషులను చేస్తుంటుంది. ఆమె గురించి తెలుసుకోవడానికి సిటీ నుంచి మానస (శ్రేయరాణి), సంజయ్ (రోషన్) వెళ్తారు. వాళ్ళకు తన గతాన్ని చెప్పిన మహాదేవి.. అదే సమయంలో తన కుటుంబం ఆపదలో ఉన్న విషయాన్ని గ్రహిస్తుంది. తన బాబాయ్ (భానుచందర్) కూతురు మహిమ (ఉల్కా గుప్తా) గర్భవతిగా ఉండి, ఆత్మహత్య చేసుకున్న విషయం మహాదేవికి తెలుస్తుంది. ఆ ఇంటిలో మరికొన్ని ఆత్మలు ఉన్నాయనే సంగతి ఆమెకు అక్కడికి వచ్చాక అర్థమౌతుంది. మహిమ ఆత్మహత్య వెనుక కలి నుంచి ఉద్భవించిన ఘోర క్షుద్రశక్తి ‘అగధ’ ఉందనే విషయం మహాదేవి గ్రహిస్తుంది. మహిమ ప్రియుడు సింహా (శ్రవణ్‌రెడ్డి) ఆచూకీ లేకపోవడానికి, వారి స్నేహితుడు బబ్లూ (వైవా రాఘవ) కిరాతక హత్యకు, తదనంతరం మహిమ ఆత్మహత్యకు ‘అగధ’ కారణమని మహాదేవి తెలుసుకుంటుంది. అసలు అగధ ఎవరు? ఎందుకు మహాదేవి కుటుంబ సభ్యులను అది హింసిస్తోంది? దైవిక శక్తులు ఉన్న మహాదేవి, అగధను ఎలా అడ్డుకోగలిగింది? అనేదే మిగతా సినిమా.
ఇవి కూడా చదవండి:
‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్.. రా, రస్టిక్ అండ్ బోల్డ్‌గా ఆశిష్ గాంధీ రచ్చ
‘RC17’ మ్యూజిక్ డైరెక్టర్.. అనిరుధ్ కూడా కాదా!
Sigma Trailer: ‘సిగ్మా’ ట్రైలర్.. విజయ్ కొడుకు హిట్టుకొట్టేలానే ఉన్నాడే!