Shambhala OTT: ముందే.. ఓటీటీకి వచ్చేసిన శంబాల! డోంట్ మిస్
ABN, Publish Date - Jan 21 , 2026 | 10:26 AM
ఆది సాయికుమార్ హీరోగా గత నెల చివరలో థియేటర్లకు వచ్చి సంచలన విజయం సాధించిన సూపర్ నాచురల్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం శంబాల.
ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) హీరోగా గత నెల చివరలో థియేటర్లకు వచ్చి సంచలన విజయం సాధించిన సూపర్ నాచురల్ హర్రర్ థ్రిల్లర్ చిత్రం శంబాల (Shambhala). అర్చన అయ్యర్ (Archana Iyer), స్వాసిక (Swasika) కీలక పాత్రల్లో నటించగా ఏ (యాడ్ ఇన్పినిటం) ఫేం యుగంధర్ ముని (Ugandhar Muni) దర్శకత్వం వహించాడు.కాగా ఈ సినిమా థియేటర్ రన్ సక్సెస్‌ఫుల్‌గా ముగించుకుని చెప్పిన సమయం కన్నా ఒక రోజు ముందుగానే డిజిట్ స్ట్రీమింగ్‌కు వచ్చి ప్రేక్షకులను అశ్చర్య పరిచింది.
కథ విషయానికి వస్తే.. 1980 కాలంలో శంబాల అనే ఊరిలో ఓ రోజు రాత్రి ఉన్నట్టుండి ఓ గ్రహ శకలం పడుతుంది. ఆ మరునాటి నుంచే అక్కడ వింత వింత ఘటనలు జరగడం ప్రారంభం అవుతాయి. మనుషులు క్రూరంగా ప్రవర్తిస్తూ ఎదుటివారిని చంపి వారు చనిపోతుంటారు. దీంతో.. ఆ ఊరిలో పడిన గ్రహ శకలం వళ్లే ఊరికి అరిష్టం వచ్చిందని ప్రజలు బెంబేలెత్తి పోతుంటారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ ఉల్క గురించి పరిశోధించేందుకు విక్రమ్ అనే అధికారిని అక్కడకు పంపుతుంది.
విక్రమ్ అక్కడి పరిస్థితులను, పరిసరాలను పరిశీలించి అక్కడ పడిన రాయికి ఊర్లో జరుగుతున్న అనర్థాలకు ఏ మాత్రం సంబంధం లేదని తేలుస్తాడు. అంతేగాక ప్రజలు దారుణంగా చనిపోవడానికి గల అతి భయంకరమైన కారణాన్ని సైతం కనిపెడతాడు. దాని నుంచి ఆ ఊరిని, ప్రజలను రక్షించాడా లేదా దేవి అనే అమ్మాయి ఎలా సాయం చేసింది. ఇంతకు దేవి ఎవరు అనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది.
ఓ మాములు చిన్న సినిమాగా వచ్చిన శంబాల.. థియేటర్లలో ప్రభంజనమే సృష్టించి రూ. 25కోట్లకు పైగా కలెక్షన్లు కొట్టగొట్టింది. స్టోరీ లైన్, స్ట్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నప్పటికీ బడ్జెట్ పరిమితుల వళ్ల ఇంకా పూర్తిగా ఎక్స్‌ఫ్లోర్ చేయలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇంకాస్త డబ్బు పెట్టి ఉంటే సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరేంత రేంజ్ ఉంది. అయినా ఇప్పుడు ఉన్న సినిమా వీక్షకులను ఏ మాత్రం నిరుత్సాహ పరుచదు. సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి మరి భయ పెట్టిస్తుంది.
ఈ సినిమా ఇప్పుడు అహా (Aha Video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో మిస్సయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారికి , మంచి థ్రిల్లర్లు ఇష్ట పడే వారికి ఈ చిత్రం మంచి ఫీస్ట్ వంటిది. డోంట్ మిస్. అక్కడక్కడ కాస్త భయంకర సీన్లు ,రక్త పాతాలు ఉంటాయి అవి మినహా సినిమా అసాంతం ఫ్యామిలీతో కలిసి చూసేయవచ్చు. ఆటిజం ఉన్న అమ్మాయి, ఆవు, అన్నపూర్ణమ్మ, హీరోయిన్ ఎపిసోడ్లు ఈ సినిమాకు హైలెట్.