సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యూట్యూబర్ కోమలి ఆత్మహత్య

ABN, Publish Date - Feb 25 , 2026 | 11:24 AM

ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ కోమ‌లి (YouTuber Komali) ఆత్మ‌హ‌త్య చేసుకుని త‌నువు చాలించింది.

komali

ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ కోమ‌లి (YouTuber Komali) ఆత్మ‌హ‌త్య చేసుకుని త‌నువు చాలించింది. రాయదుర్గం పీఎస్ (Raidurgam Police Station) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమ‌వారం సూసైడ్ చేసుకోగా ఆల‌స్యంగా ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

వివ‌రాల్లోకి వెళితే.. మ‌ణికొండ చిత్ర‌పురి కాల‌నీలోని త‌న మామ ఇంట్లో ఉంటున్న కోమ‌లి మ‌ల్లారెడ్డి వ‌ర్షిటీలో బీఎస్సీ చదువుతోంది. పార్ట్ టైమ్‌గా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ అన‌తి కాలంలోనే గుర్తింపు ద‌క్కించుకుంది. అయితే.. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ యూట్యూబర్‌గా రాణిస్తున్న‌ అఖిల్ రెడ్డితో మూడేళ్లుగా ఆమె ప్రేమలో ఉందని తెలుస్తోంది. గ‌తేడాది బ్రేక‌ప్ చెప్పుకుని ఇరువురు విడిపోయారని సమాచారం.

కాగా కోమ‌లి ఆత్మ‌హ‌త్య‌కు రెండు రోజుల ముందు అఖిల్‌తో ఫోన్‌లో వాగ్వాదం జ‌రిగిన‌ట్లు తెలిసింది. ఆ ఘ‌ట‌న అనంత‌రం కోమ‌లి మనస్థాపంతో చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స‌మాచారం. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. రాయ‌దుర్గం పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:28 PM