Vishnu Priya: ఆదరణ తగ్గింది.. గ్లామర్ డోస్ పెంచింది
ABN, Publish Date - Aug 02 , 2026 | 11:29 AM
యాంకర్ విష్ణుప్రియ భీమినేని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫొటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంటారు.
యాంకర్ విష్ణుప్రియ భీమినేని (Vishnu Priya Bhimaneni) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ ఫొటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంటారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌పై ఎక్కువ దృష్టి పెట్టిన ఆమె.. ప్రత్యేక కంటెంట్ ద్వారా సబ్‌స్క్రైబర్లను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్లామర్ ఫొటోషూట్లు, ఎక్స్‌క్లూజివ్ వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ క్రమంలో ఆమె పోస్టులపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో పాటు కొన్ని వివాదాలు కూడా చెలరేగాయి. అయితే ఆ ప్రచారం ఆమెకు సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరగడానికి కొంత మేర ఉపయోగపడింది. మొదట్లో 1,500 మంది ఉన్న సబ్‌స్క్రైబర్లు కొద్ది రోజుల్లోనే 4,800కి దాటింది. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 5 వేల వద్ద ఆగిపోయింది. ఒక్కో సబ్‌స్క్రైబర్ నుంచి నెలకు రూ.399 చొప్పున వసూలు చేస్తుండటంతో ఆమెకు ఈ ఫీచర్ ద్వారా మంచి ఆదాయం వస్తోందని ప్రచారం జరుగుతోంది.
అయితే సబ్‌స్క్రైబర్ల సంఖ్య మరింత వేగంగా పెరుగుతుందని భావించిన విష్ణుప్రియ అంచనాలు తారుమారయ్యాయి. దీంతో సాధారణ ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లోనూ వరుసగా కొత్త ఫొటోషూట్లు, ఆకర్షణీయమైన పోస్టులను పంచుకుంటూ ఫాలోవర్ల దృష్టిని తనవైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు విష్ణు ప్రియ. అదే సమయంలో సబ్‌స్క్రైబర్ల కోసం మరింత ప్రత్యేకమైన కంటెంట్‌ను అందిస్తున్నట్లు కూడా సంకేతాలు ఇస్తున్నారు.