సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay: కోర్టు సై.. సెన్సార్ బోర్డ్ నై! జ‌న‌నాయ‌గ‌న్‌కు.. త‌ప్ప‌ని తిప్ప‌లు

ABN, Publish Date - Jan 09 , 2026 | 12:33 PM

విజయ్ జన నాయగన్ కు ఇంకా సెన్సార్ కష్టాలు తీరలేదు. ఈ సినిమాకు ముందు ప్రకటించినట్టు 'యు/ఎ' సర్టిఫికెట్ ఇవ్వాలని సింగిల్ బెంచ్ జడ్జ్ చెప్పిన తీర్పుపై సీబీఎఫ్సీ అప్పీల్ కు వెళ్ళినట్టు సమాచారం.

Jana Nayagan Movie

దళపతి విజయ్ (Vijay) చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) పొంగల్ కానుకగా శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ (CBFC) ఇవ్వడానికి నిరాకరించడంతో ఈ సినిమా విడుదల వాయిదాపడింది. అయితే గురువారం మద్రాస్ హైకోర్ట్ ఈ కేసును విచారించి, ముందుగా అంగీకరించిన విధంగా 'జన నాయగన్'కు యు/ఎ 16 ప్లస్ సర్టిఫికెట్ ను జారీచేయాలని పేర్కొంది. దాంతో 'జన నాయగన్' మూవీని 14న విడుదల చేస్తారనే ప్రచారం కోలీవుడ్ లో జరిగింది.

నిజానికి ఈ యేడాది శివ కార్తికేయన్ మూవీ 'పరాశక్తి'ని తొలుత జనవరి 14వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకుని ఆ సినిమాను 10వ తేదీకి ప్రీపోన్ చేశారు. కానీ చిత్రం ఏమంటే... నిన్నటి వరకూ 'పరాశక్తి' సినిమాకూ సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. ఇవాళ ఆ సినిమాకు సర్టిఫికెట్ లభిస్తుందని అంటున్నారు. మొత్తం మీద పొంగల్ కానుకగా రావాల్సిన 'జన నాయగన్, పరాశక్తి' చిత్రాలతో సెన్సార్ బోర్డ్ గట్టిగానే ఆటలాడుకుంది.


ఇక విజయ్ 'జన నాయగన్' మూవీ విషయానికి వస్తే... సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సీబీఎఫ్‌సీ సవాల్ చేయబోతున్నట్టు చెన్నయ్ సమాచారం. ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించిన కారణాలను మరింత గట్టిగా సీబీఎఫ్ సీ బోర్డ్ కోర్టు కు తెలియ చేయబోతోందట. కాబట్టి.. 'జన నాయగన్' నిర్మాణ సంస్థ కె.వి.ఎన్. ప్రొడక్షన్ హౌస్ హడావుడిగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించకుండా.. మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - Jan 09 , 2026 | 03:11 PM