ఫిల్మ్ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఎన్నికల్లో వల్లభనేని అనిల్‌ విజయం

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:04 PM

తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్‌ 30 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

Telugu Film Employees Federation elections

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్ ఎన్నికలు ఆదివారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగాయి. యూసఫ్‌ గూడ డివిజన్‌ వెంకటగిరిలో ఈ ఎన్నికలను నిర్వహించారు. ఇందులో అధ్యక్షపదవికి వల్లభనేని అనిల్ (Vallabhaneni Anil), చిట్టినేని కిశోర్‌ బాబు పోటీ పడ్డారు. ప్రధాన కార్యదర్శి పదవి కోసం అమ్మిరాజు కానుమిల్లి, లంక రాజేంద్ర ప్రసాద్‌, పేర్ని రాంబాబు బరిలో దిగారు. కోశాధికారిగా జి. భీముడు (శ్రీకాంత్‌), వెల్లంకి శ్రీనివాస్‌ పోటీ పడ్డారు.


తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన మొత్తం 24 శాఖలకు సంబంధించిన కీలక నేతలు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. ఆ రకంగా మొత్తం 72 ఓట్లు ఉండగా 69 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్‌ కుమార్, ప్రధాన కార్యదర్శిగా లంక రాజేంద్ర ప్రసాద్‌, కోశాధికారిగా వెల్లంకి శ్రీనివాస్‌ విజయం సాధించారు. అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్‌ 30 ఓట్ల మెజారిటీతోనూ, ప్రధాన కార్యదర్శి లంక రాజేంద్ర ప్రసాద్‌ 14 ఓట్ల మెజారిటీతోనూ, వెల్లంకి శ్రీనివాస్ కోశాధికారిగా 4 ఓట్ల మెజారిటీతోనూ గెలిచారు. వీరి పదవీ కాలం రెండేళ్ళు.

ఇవి కూడా చదవండి:

రాజమౌళి వెనక ఉన్న ఫోటోలో ఒక మినీ ప్రపంచమే ఉంది.. చూశారా?

బాలయ్య హీరోయిన్‌కు అవకాశాలు కరువు.. కారణం అదేనా?

లెజెండరీ మల్టీస్టారర్‌‌ చిత్రాన్ని అలా వదిలేశారేంటి? ఇలా అయితే కష్టమే!

స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!

Updated Date - Apr 27 , 2026 | 12:15 PM