సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కవల పిల్లల జననం తర్వాత ఎన్నో కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన కామినేని

ABN, Publish Date - Nov 18 , 2026 | 05:51 AM

కవల పిల్లల జననం తర్వాత ఎదురైన మానసిక, శారీరక సమస్యల గురించి ఉపాసన కామినేని భావోద్వేగంగా మాట్లాడారు.

Upasana

కవల పిల్లల జననం తర్వాత నా ప్రయాణం ఎంతో కష్టంగా సాగింది. ఆ అనుభవం ఇప్పటికీ బాధ కలిగించేదే. అందుకే మహిళలు తమ బాధలను మనసులోనే దాచుకుని ఒంటరిగా ఉండిపోకూడదు. దంపతులిద్దరూ కలిసి బయటకు వచ్చి అవసరమైన సహాయం, వైద్య సలహాలు తీసుకోవాలి' అని అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ ఉపాసన కామినేని కొణిదెల (Upasana Konidela) అన్నారు. అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 'అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ (Apollo Women & Children’s Institute) సెంటర్‌ను మంగళవారం ఆమె ప్రారంభించారు. ఇకపై దీనిని ఇనిస్టిట్యూట్ ఆప్ పేరేంట్స్ అండ్ చిల్డ్రన్‌గా పిలవనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఉపాసన తన వ్యక్తిగత గర్భధారణ అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. రెండో సారి కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఎదురైన మానసిక, శారీరక సమస్యల నుంచి పూర్తిగా కోలుకోలేదన్నారు. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రెగ్నెన్సీ పరీక్షలో సానుకూల ఫలితం కోసం ఎదురు చూసే ఆందోళన, నెలసరి రావడంతో కలిగే నిరాశ వంటి అంశాలపై కూడా సమాజంలో విస్తృతంగా చర్చ జరగాలని అభిప్రాయ వడ్డారు.

ప్రసవం తర్వాత ఉండే నాలుగో త్రైమాసికం కూడా అత్యంత కీలకమని, బిడ్డ ఆరోగ్యంతో పాటు తల్లి శారీరక, మానసిక ఆరోగ్యానికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ నూతన కేంద్రంలో ప్రత్యేక ప్రసూతి విభాగం, లెవల్ నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పెరినేటల్ కేంద్రం ఏర్పాటు చేశారు. సీనియర్ గైనకాలజి స్థులు ఫణి జ్యోత్స్న, పూజితాదేవి, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషి యన్లు శ్రావంతి రెడ్డి, రఘుపతి. ఆర్, కన్సల్టెంట్ నియోనేటలాజిస్ట్, పీడియాట్రిషియన్ ఎస్. ఎల్. నరసింహారెడ్డి, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్కరన్ సింగ్ సహానీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2026 | 05:51 AM