సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

గాయకుడి అవతారమెత్తిన.. బండి సంజ‌య్‌

ABN, Publish Date - Mar 27 , 2026 | 07:10 AM

కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజయ్ గాయకుడి అవతారమెత్తి ఆర్ఎస్ఎస్ గీతాలను ఆలపించారు.

bandi sanjay

కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) గాయకుడి అవతారమెత్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) (Rashtriya Swayamsevak Sangh) ను స్థాపించి శత వసంతాలు పూర్తవ‌డం, శుక్ర‌వారం శ్రీ రామ న‌వ‌మి ప‌ర్వ‌దినం నేప‌థ్యంలో ‘గళమెత్తి పాడాలి.. ఇది సంఘ గీతం’ అంటూ రచించిన ప్రత్యేక ఆర్ఎస్ఎస్ (RSS) గీతాన్ని ఆయ‌న ఆలపించారు. త‌న క‌ళాశాల స‌మ‌యంలో ఆర్ఎస్ఎస్‌లో పనిచేసిన సంజయ్ జాతీయ వాదం, హిందుత్వ సిద్ధాంతాలను పూర్తిగా పుణికి పుచ్చుకున్నారు.

ఈ నేప‌థ్యంలోనే RSS శత వసంతాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా దాని సిద్ధాంతాలను సామాన్య ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఆ సంస్థ గీతాలను ఆలపించారు. సంజయ్ పాడిన గీతాలకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల కాగా, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా శుక్ర‌వారం ఈ గీతాలను కరీంనగర్‌లో శుక్రవారం అధికారికంగా విడుదల చేయనున్నారు.

Updated Date - Mar 27 , 2026 | 07:10 AM