సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘తుంబాడ్’ ఫేమ్ సౌండ్ డిజైనర్ మందార్ కమలాపుర్కర్ గెస్ట్ లెక్చర్!

ABN, Publish Date - Mar 13 , 2026 | 05:42 PM

'తుంబాడ్‌' చిత్ర సౌండ్ డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత మందార్ కమలాపుర్కర్‌ అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా స్టూడెంట్స్ కు స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. సౌండ్ కు సంబంధించి ఆయన కొన్ని టిప్స్ ను విద్యార్థులకు తెలియచేశారు.

Mandar Kamalapurkar

అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా (Annapurna College of Film and Media) లో ఇటీవల నేషనల్ అవార్డు గ్రహీత, సౌండ్ రికార్డిస్ట్, డిజైనర్ మందార్ కమలాపుర్కర్ (Mandar Kamalapurkar) గెస్ట్ లెక్చర్‌ను ఇచ్చారు. సినిమాలో శబ్దం కేవలం సాంకేతిక అంశం మాత్రమే కాకుండా కథనానికి ఎలా వెన్నెముకగా నిలుస్తుందో ఆయన విద్యార్థులకు వివరించారు.


'తుంబాడ్‌'తో పాటు పలు భారతీయ చిత్రాలకు పనిచేసిన అనుభవంతో మందార్ సౌండ్ డిజైన్ గొప్పతనాన్ని తెలిపారు. తాను పనిచేసిన పలు చిత్రాల ఉదాహరణలతో వివరణ ఇచ్చిన ఆయన, కొన్ని ప్రత్యేక సన్నివేశాలను విశ్లేషిస్తూ అంబియెన్స్, సౌండ్ ఎఫెక్ట్స్, సైలెన్స్, ఎకో వంటి అంశాలు పాత్రల మానసిక భావాలను ఎలా ప్రతిబింబిస్తాయో వివరించారు. అలాగే, సరిగ్గా రూపొందించిన శబ్దాలు ప్రేక్షకుల అనుభూతిని ఎలా ప్రభావితం చేస్తాయో, సినిమా స్థాయిని ఎలా పెంచుతాయో తెలిపారు. సృజనాత్మక ఆలోచన, సాంకేతిక నైపుణ్యం కలిసి ఎలా ప్రొఫెషనల్ సౌండ్ ప్రాక్టీస్‌గా మారుతుందనేది ఆయన విద్యార్థులలో అవగాహన కల్పించారు. శబ్దాన్ని ఒక కథ చెప్పే సాధనంగా ఎలా వినాలి, ఎలా ఆలోచించాలి? అనే విషయాల్లో విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Mar 13 , 2026 | 05:42 PM