ఎన్టీఆర్ సినిమాకు ముందే.. చిరంజీవితో త్రివిక్రమ్ మూవీ?
ABN, Publish Date - Nov 13 , 2026 | 01:07 PM
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతోందనే ప్రచారం టాలీవుడ్‌లో ఆసక్తి రేపుతోంది.
సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లలో సినిమాలు రావాలని అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కొరుకుంటారు. అలాంటి ఓ కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). గతంలో చిరు నటించిన జై చిరంజీవ (Jai Chiranjeeva) సినిమాకి త్రివిక్రమ్ కథ, మాటలు అందించగా.. కె. విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఇందులో మెగాస్టార్ కామెడీ టైమింగ్‌కు తగ్గట్టుగా త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగులు, బ్రహ్మానందం-చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పాపులర్ అయ్యాయి. చిరు సినిమాకు త్రివిక్రమ్ పనిచేయడం ఇదే మొదటిసారి, చివరిసారి. ఇక మెగా ఫ్యామిలీ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మూడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో మూడు చిత్రాలు చేసిన చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం ఇప్పటివరకు రాలేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని పలుమార్లు వార్తలు వచ్చినా ఏ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారు కాలేదు.
అయితే, తాజాగా మరోసారి చిరు, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే వీరిద్దరి కలయికలో సినిమా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ త్రివిక్రమ్‌తో సినిమా కోసం చాన్నాళ్ల క్రితమే ఒప్పందం చేసుకుందని, ఇప్పుడా కమిట్‌మెంట్‌ను ఉపయోగించి చిరు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిల్మ్‌నగర్ టాక్. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. అంతే కాదు మెగాస్టార్‌కి త్రివిక్రమ్ చెప్పిన లైన్ నచ్చడంతో పూర్తి కథను సిద్ధం చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. అటు ఇటీవల హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ నుంచి త్రివిక్రమ్ బయటకు వచ్చారని వార్తలు రావడంతో ఈ ప్రాజెక్ట్ నిజంగానే తెరకెక్కనుందనే ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే, దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే, ఈ సినిమా పట్టాలెక్కడం అంత సులభం కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రస్తుతం త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ఇటీవల ఆదర్శకుటుంబంంతో ప్రేక్షకుల ముందుకు రాగా అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో గాడ్ ఆఫ్ వార్‌తో హిట్ కొట్టాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. అటు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కాకా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. వచ్చే సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుండగా.. కాకా తర్వాత శ్రీకాంత్
అయితే ఈ సినిమా పట్టాలెక్కడం అంత సులభం కాదని, అందుకు చాలా అంశాలు అనుకూలించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా సన్నాహాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. ఒకవేళ చిరంజీవితో సినిమా చర్చలు ముందుకుసాగితే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే చిరు-త్రివిక్రమ్ కాంబో తాలూకు వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనా? ఇందులో ఏమైనా వాస్తవం ఉందా అనే విషయాల్లో స్పష్టత రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.