ఈవారం.. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలివే
ABN, Publish Date - Mar 25 , 2026 | 12:52 PM
ఈ శుక్రవారం (మార్చి 27) థియేటర్లలో కొత్త సినిమాల సందడి భారీగానే ఉండనుంది.
ఈ శుక్రవారం (మార్చి 27) థియేటర్లలో కొత్త సినిమాల సందడి భారీగానే ఉండనుంది. ఎక్కువ హైప్ ఉన్న సినిమాలు తక్కువగా ఉన్నప్పటికీ, కంటెంట్‌పై నమ్మకంతో వస్తున్న పలు భాషల చిత్రాలు ఈ ఫ్రైడే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. యాక్షన్ నుంచి ఎమోషనల్ డ్రామా వరకు విభిన్న జానర్లలో తెరకెక్కిన ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. కొత్త కథలు, కొత్త ప్రయత్నాలు ఈ వారం సినీ ప్రియులకు మంచి థియేటర్ అనుభూతిని అందించనున్నాయి.
ముఖ్యంగా తెలుగు నుంచి అర డజను, మలమాళం నుంచి ఐదు, తమిళ, కన్నడ భాషల నుంచి నాలుగేసి సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఇక బాలీవుడ్‌లో స్ట్రెయిట్ సినిమా ఏది రిలీజ్ లేకపోవడం విశేషం. హాలీవుడ్ చిత్రం 'ప్రాజెక్ట్‌హెల్ మేరి' మాత్రం ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది. చూడాలి మరి ఈ వారం వస్తున్న సినిమాల్లో ఎన్ని ప్రజాదరణ పొందుతాయో!? ఇక తెలుగులో విడుదల కానుప్ప ఆరు సినిమాల్లో ప్రియదర్శి 'సుయోధన', 'కోర్టు' ఫేం రోషన్, శ్రీదేవి 'బ్యాండ్ మేళం', మంచు లక్ష్మి 'లేచింది మహిళాలోకం' వంటి స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పాటు 'యూత్, హ్యాపీరాజ్' వంటి డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి.
ఈ వారం థియేటర్లలో..
రిలీజ్ అవుతున్న సినిమాల జాబితా
English
Project Hail Mary
They Will Kill You Mar 27
Telugu
Band Melam Mar 26
Project Hail Mary Mar 26
Lechindi Mahila Lokam Mar 26
Youth Mar 27
Suyodhana Mar 27
Happy Raj Mar 27
Malayalam
Derby Mar 26
Prathichaya Mar 26
Kirata Mar 27
Kalyana Maram Mar 27
Kaalam Paranja Kadha Mar 27
Tamil
Project Hail Mary Mar 26
Happy Raj Mar 27
Nee Forever Mar 27
Satan: The Dark Satan: The Dark
Kannada
Ayudha Mar 27
Chamayya s/o Ramachari Mar 27
Yava Mohana Murali Kareyitu Mar 27
Gujarati
Parijaat Mar 27