OG Tour: తమన్‌ షో మరోసారి వాయిదా!

ABN , Publish Date - Jun 13 , 2026 | 04:12 PM

ఈ రోజు జరగాల్సిన తమన్ ఓజీ టూర్ హైదరాబాద్‌ లైవ్ కాన్సర్ట్ వాయిదా పడింది. నిజానికి ఇది జూన్ 6న జరగాల్సింది. కానీ ఈ రోజుకు మార్చారు. కానీ ఇవాళ మరోసారి వాయిదా పడింది.

Thaman

ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ జూన్ 13న (ఈరోజు) నిర్వహించాల్సిన ఓజీ టూర్ - హైదరాబాద్‌ లైవ్‌ కాన్సర్ట్ మరోసారి వాయిదా పడింది. ఎస్. తమన్ 'ఓజీ టూర్‌ ఇండియా' పేరుతో పలు నగరాల్లో లైవ్‌ కన్సర్ట్స్ ను ప్లాన్ చేశారు. అందులో భాగంగా హైదరాబాద్‌ లో తొలుత జూన్ 6న ఈవెంట్ జరపాలనుకున్నారు. కానీ అప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో దానిని 13వ తేదీకి వాయిదా వేశారు. కానీ ఈ రోజు కూడా ప్రతికూల వాతావరణం కారణంగా మరోసారి వాయిదా వేశారు. నిర్వహాకులు ఈ విషయాన్ని తెలియచేస్తూ, భారీ వర్షాల కారణంగా ప్రేక్షకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.


అన్ని అనుకున్నట్టుగా జరిగే ఇవాళ హైదరాబాద్‌లోని బౌల్డర్ హిల్స్ లో ఈ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగి ఉండేది. అయితే కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు చెప్పారు. తొలుత హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ ను నిర్వహించి, ఆ తర్వాత జూలై 11న బెంగళూరులో, ఆగస్టు 15న చెన్నైలో, సెప్టెంబర్ 25న వైజాగ్‌లో ఈవెంట్లు నిర్వహించాలని అనుకున్నారు. ప్రస్తుతం తమన్... బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేశ్‌ వంటి సీనియర్‌ హీరోల సినిమాలతో పాటు అఖిల్‌, అనీశ్‌ చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

సుహాసిని బయటపెట్టిన సంచలన నిజం.. చిరంజీవి వల్లే ఆ సీన్ సాధ్యమైంది

Lenin: మళ్ళీ అయ్యగారి సినిమా వాయిదా.. ?

షాకింగ్.. కలిసిపోయిన విజయ్- సంగీత.. త్రిష పరిస్థితి ఏంటో

Updated Date - Jun 13 , 2026 | 04:14 PM