సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సినీ కార్మిక అనుబంధ సంఘాల పేరు చివర తెలంగాణ!

ABN, Publish Date - Apr 08 , 2026 | 07:22 PM

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌లోని అనుబంధ సంస్థల పేరు చివర ఆఫ్ తెలంగాణ అనే పదం చేరబోతోంది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి ఓ లేఖను విడుదల చేశారు.

Telugu Film Employees Federation

తెలుగు ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఫెడరేషన్‌లోని 24 అనుబంధ సంస్థల పేర్ల చివర తెలంగాణ పదాన్ని ఏర్పాటు చేయాలని తెలిపింది. గత కొంతకాలంగా ఈ విషయమై వివిధ అనుబంధ సంస్థలలో చర్చకు వచ్చిన నేపథ్యంలో ఏప్రిల్‌ 5న ఫెడరేషన్‌ జనరల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ను ఏర్పాటు చేసి, ఈ విషయమై కూలంకషంగా చర్చించింది. ఈ సమావేశానికి హాజరైన వారంతా ఏకగ్రీవంగా యూనియన్‌ పేర్ల చివర 'ఆఫ్‌ తెలంగాణ' అని జతచేయడానికి ఆమోదం తెలిపారు.


దాంతో ఈ మార్పు ఎలా చేయాలనే విషయాన్ని తెలియచేస్తూ, ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి ఓ లేఖను విడుదల చేశారు. ఫెడరేషన్‌లోని అన్ని అనుబంధ సంస్థలు వెంటనే ఈసీ మీటింగ్‌ ఏర్పాటు చేసుకుని ఈ మార్పును గురించి సభ్యులకు తెలియచేసి, పేరు చివర 'ఆఫ్ తెలంగాణ' అనే చేర్చుతూ తీర్మానం చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉదాహరణకు ఇంతవరకూ తెలుగు ఫిలిమ్‌ అండ్ డిజిటల్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ అని ఉన్న యూనియన్‌ పేరు చివర 'ఆఫ్‌ తెలంగాణ' అనే దాన్ని జత చేస్తారు. ఆ రకంగా 24 అనుబంధ సంస్థలు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Apr 08 , 2026 | 07:23 PM