సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో రాజ్ దాసిరెడ్డి

ABN, Publish Date - Oct 23 , 2026 | 08:23 PM

న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2026లో తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి సందడి చేశారు. ప్రస్తుతం ఆయన ఓ బహుభాషా చిత్రంలో నటిస్తున్నారు.

Raj Dasireddy

తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ 2026లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. గతంలో 2025 ఆస్కార్ వేడుకలకు ఆహ్వానం అందుకున్న ఆయన.. ఇప్పుడు అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై కనిపించడంతో సోషల్ మీడియాలోనూ ఆయన గురించి చర్చ జరుగుతోంది.

రాజ్ దాసిరెడ్డి అమెరికాలో చదువుకున్నారు. అక్కడే ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత నటుడిగా మారారు. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ‘భద్రం బీకేర్ ఫుల్ బ్రదరు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన రాజ్.. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతం రాజ్ దాసిరెడ్డి ఓ బహుభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. కొత్త తరహా కథతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో తన కెరీర్‌లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. మరి ఈ కొత్త సినిమా రాజ్ దాసిరెడ్డి కెరీర్‌కు ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.

Updated Date - Oct 23 , 2026 | 10:19 PM