తెలంగాణ సింగిల్ స్క్రీన్ థియేటర్లు.. కీలక నిర్ణయం
ABN, Publish Date - Apr 02 , 2026 | 07:52 PM
చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాలలో సినిమాలు, థియేటర్ల (Theatres) చుట్టూ అనేక పర్యవసనాలు జరిగిన విషయం తెలిసిందే.
చాలా రోజులుగా తెలుగు రాష్ట్రాలలో సినిమాలు, థియేటర్ల (Theatres) చుట్టూ అనేక పర్యవసనాలు జరిగిన విషయం తెలిసిందే. అంతేగాక కొంతకాలం సింగిల్ స్ట్రీన్ థియేటర్లు బంద్ కూడా చేశారు. అయితే తాజాగా ఈ అంశంలో తెలంగాణ (Telangana) సింగిల్ స్క్రీన్ (single screens theatres) థియేటర్ల యాజమాన్యం ఒక కీలక మార్పు తీసుకొచ్చింది. ఇప్పటివరకు సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఫిక్స్‌డ్ రెంట్ విధానం అమల్లో ఉండేది. కానీ ఇకపై ఆ విధానానికి గుడ్‌బై చెప్పి పర్సెంటేజ్ సిస్టమ్‌ను అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ కొత్త విధానం ప్రకారం: మొదటి వారం – 60%, రెండో వారం – 50%, మూడో వారం – 40% రెవెన్యూ షేరింగ్ మోడల్‌ను అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే దాదాపు 23 థియేటర్లు ఈ నిర్ణయానికి మద్దతు తెలిపాయి. ఇది విజయవంతమైతే మరిన్ని థియేటర్లు కూడా ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మార్పు వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరికీ సమతుల్యమైన లాభాల పంపకం జరుగుతుందని భావిస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఎలా నడుస్తుందో దాని ఆధారంగా ఆదాయం పంచుకోవడం వల్ల రిస్క్ తగ్గే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఓటీటీ ప్రభావం, పెద్ద సినిమాల కొరత, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు సింగిల్ స్క్రీన్ థియేటర్లపై తీవ్ర ప్రభావం చూపించాయి. కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు మూసివేత దిశగా వెళ్లిన పరిస్థితులు కూడా కనిపించాయి. ఈ కష్టకాలంలో కొత్త విధానం ఒక ఉపశమనం కావొచ్చని ఆశిస్తున్నారు.
అయితే.. ఏప్రిల్ 3 నుంచి ఈ పర్సెంటేజ్ విధానం అమల్లోకి రానుంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి కానీ, టాలీవుడ్ వ్యాపార విధానంలో ఇది ఒక ముఖ్యమైన మార్పుగా నిలవడం ఖాయం. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుంచి కీలక నిర్ణయం బయటకు రావడంతో సినీ రంగంలో కొత్త చర్చ మొదలైంది. రేపటి నుంచి సినిమాల విడుదల, కలెక్షన్లపై దీని ప్రభావం ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది.