‘తీరం’ టైటిల్ సాంగ్ విడుదల
ABN, Publish Date - Jul 28 , 2026 | 05:40 PM
ప్రభు, హరిప్రియ, వైశాలి, నిరుడి శ్రీనివాస్ కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న ‘తీరం’ (Teeram) సినిమా టైటిల్ సాంగ్‌ను ఇటీవల ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు.
ప్రభు, హరిప్రియ, వైశాలి, నిరుడి శ్రీనివాస్ కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న ‘తీరం’ (Teeram) సినిమా టైటిల్ సాంగ్‌ను ఇటీవల ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ‘పుష్ప’ ఫేమ్, జగదీష్, ఫన్ బకెట్ మహేష్ విట్ట, రాజ్‌కుమార్ కసిరెడ్డి, దర్శకుడు ప్రసాద్ తదితరులు హాజరై టైటిల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. శ్రీ భవానీ క్రియేషన్స్ పతాకంపై ఉపేందర్ గంగావెల్లి నిర్మిస్తున్నారు. వంశీ మునగాల దర్శకుడు. సాంగ్ రిలీజ్ అనంతరం దర్శకుడు వంశీ మునగాల మాట్లాడుతూ, ‘తీరం’ ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా భావోద్వేగభరితమైన కథతో రూపొందుతోంది. చిత్రీకరణ విజయవంతంగా పూర్తై ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా సినిమాను అత్యంత నాణ్యతతో రూపొందిస్తున్నాం' అని అన్నారు. హీరో ప్రభు మాట్లాడుతూ "షార్ట్ ఫిల్మ్స్‌తో సినీ ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పుడు ఫీచర్ ఫిల్మ్‌లో హీరోగా నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంద'న్నారు.