ఒకే వేదికపై.. విజయ్, జగన్, కేటీఆర్, త్రిష, అదాని
ABN, Publish Date - Nov 06 , 2026 | 05:59 AM
తమిళ నాడు సీఎం విజయ్, ఏపీ మాజీ సీఎం జగన్ , తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఒకే వేదికపై కనిపించారు.
తమిళ నాడు సీఎం విజయ్ (Tamil Nadu CM Vijay), ఏపీ మాజీ సీఎం జగన్ (YS Jagan Mohan Reddy), తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ (K. T. Rama Rao) ఒకే వేదికపై కనిపించారు. చెన్నైలో జరిగిన వివాహ వేడుక ఇందుకు వేదికైంది.
జగన్ బాబాయ్ వైఎస్ జార్జ్ రెడ్డి (YS George Reddy) కుమారుడు అనిల్ రెడ్డి (YS Anil Reddy) కుమార్తె శ్రేయ (Shreya) వివాహం ఉజ్వల్ (Ujjwal) తో జరిగింది.
గురువారం సాయంత్రం చెన్నై(Chennai) లోని ఓ హోటల్‌లో క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
జగన్ దంపతులు, కేటీఆర్ దంపతులు, విజయ్, నటి త్రిష (Trisha Krishnan) హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, సినీ నటుడు మంచు మనోజ్ దంపతులు, ప్రముఖ పారిశ్రా మికవేత్త గౌతమ్ అదానీ కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జగన్, విజయ్ ఆత్మీయాలింగనం చేసుకున్నారు. విజయ్, జగన్, కేటీఆర్ సరదాగా ముచ్చటించుకున్నారు. వేదిక ముందు వరుసలో గౌతం అదానీతో కలిసి విజయ్, జగన్ కూర్చుని మాట్లాడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.