ఇదెక్కడి పాటరా.. మైండ్‌లోంచి అసలు పోవట్లేదు! మంగ్లీని మించి పాడిందిగా
ABN, Publish Date - Mar 03 , 2026 | 09:43 PM
ఇటీవల జానపద పాటలు రెండు తెలుగు రాష్ట్రాలను బాగా ఊపేస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల జానపద పాటలు రెండు తెలుగు రాష్ట్రాలను బాగా ఊపేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చే పాటలైతే మరో రేంజ్‌లో ఉంటున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో ఈ పాటలు రిలీజ్ అవుతూ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. అలాంటిది.. తెలుగు జానపద పాటలు కాదని తాజాగా విడుదలైన రంగేరో రైకా (Rangero Raika) అనే తెలంగాణ బంజారా పాట అంతకుమించి అనే రేంజ్‌లో దూసుకెళుతూ ఔరా అనిపిస్తోంది.
పాటలో ఓ అక్షరం మనకు తెలియకున్నా, భావం అర్థం అవకున్నప్పటికీ.. పాట వింటున్న ప్రతి ఒక్కరూ కాలు కదపకుండా, హమ్ చేయకుండా ఉండలేక పోతున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఓ పక్షం రోజుల పాటు మన బుర్రలోనే తిరుగుతూ మరువలేకుండా చేస్తోంది. ఒక్కసారి విన్నవారు రెండు, మూడు పర్యాయాలు వినకుండా ఉండలేక పోతున్నారు.
దిలీప్ సాయి నాయక్ (Dilip Sai Naik) సాహిత్యం అందించి దర్శకత్వం వహించిన ఈ పాటకు కళ్యాణ్ కీస్ (Kalyan key's) సంగీతం అందించగా విజయ్ కుమార్, స్వప్నాలి రాథోడ్ (Swapnali Rathod) దీనిని ఆలపించారు. ఉమేశ్ పవార్ (Umesh Pawar), మంకృతి (Mankrti) నటించారు. పాటలో ట్యూన్, డ్యాన్స్, నటీనటులు అంతా ఫర్పెక్ట్‌గా ఉండి స్క్రీన్ నుంచి చూపు తిప్పుకోకుండా చేయడం ఒకెత్తయితే సింగర్ స్వప్నాలి గాత్రం మరో రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న మంగ్లీని తలదన్నేలా ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే మంగ్లీ (Mangli) ని మించి ఆ గాత్రం శ్రోతలను కట్టి పడేసేలా ఉంది. మీరూ ఈ వీడియో సాంగ్‌పై ఓ లుక్ వేయండి.