సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Suddala Ashok Teja: సామాన్యులకు.. భావం చేరువ చేసేది సినిమా పాట

ABN, Publish Date - Nov 18 , 2026 | 06:39 AM

సినిమా పాటలు సామాన్యులకు సాహిత్య భావాలను చేరువ చేస్తాయని ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు.

Suddala Ashok Teja

సాహిత్యానికి సమాజంపై ఎంతో ప్రభావం ఉంటుంది. అయితే కావ్యాలు, గ్రాంధిక కవిత్వాలు చదివి వాటిలోని భావాలను ఆస్వాదించే వారి సంఖ్య రసజ్ఞులకు మాత్రమే పరిమితంగా ఉంటే.. సినిమా పాటలు (Telugu Cinema Songs) మాత్రం సామాన్య ప్రజలకు సైతం సాహిత్యంలోని మాధుర్యాన్ని చేరువ చేస్తాయని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja) అన్నారు. కవిత్వంలోని భావాన్ని ప్రజల హృదయాలకు చేరవేయడంలో సినిమా పాటకు ప్రత్యేకమైన శక్తి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణకు చెందిన సినీ కవులు, వారి సాహిత్య ప్రయాణం, పాటల ప్రాధాన్యాన్ని పరిచయం చేసేలా డాక్టర్ తిరునగరి శరత్ చంద్ర (Tirunagari Sarath Chandra) ర‌చించిన‌ 'తెలంగాణ సినీ కవులు, సింగిడి' పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ బొగ్గుల కుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సాహితీవేత్తలు, సినీ రచయితలు, కవులు హాజరయ్యారు. ఈ సభలో అకాడమీ కార్యదర్శి నామోజీ బాలాజీ, సినీ రచయిత జేకే భారవి (JK Bharavi), కవి, సినీ విమర్శకుడు వారాల ఆనంద్ (Warala Anand), గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. కావ్యాలు, గ్రాంధిక కవిత్వాల్లోని భావాలు వాటిని చదివి ఆస్వాదించే రసజ్ఞులకు మాత్రమే ఎక్కువగా చేరుతుంటాయని అభిప్రాయపడ్డారు. అదే సినిమా పాట రూపంలో వ్యక్తమైనప్పుడు భాషతో సంబంధం లేకుండా సామాన్య ప్రేక్షకుడికి కూడా ఆ భావం చేరుతుందని వివరించారు. అందుకే సినిమా పాటను కేవలం వినోదానికి సంబంధించిన అంశంగా కాకుండా, ప్రజలకు సాహిత్యాన్ని పరిచయం చేసే మాధ్యమంగా చూడాలని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - Nov 18 , 2026 | 06:46 AM