సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎడిటర్ శ్రీకర ప్రసాద్‌కు ఆస్కార్‌లో ఓటు హక్కు!

ABN, Publish Date - Jun 25 , 2026 | 04:39 PM

ప్రముఖ ఎడిటర్‌ శ్రీకర ప్రసాద్‌ కు అత్యుత్తమ గౌరవం దక్కింది. అకాడమీ అవార్డ్స్ సభ్యునిగా ఎంపిక చేయడంతో ఆయనకు ఆస్కార్ నామినేషన్స్‌కు వచ్చే సినిమాలకు ఓటు వేసే ఆస్కారం లభించింది.

Sreekara Prasad

భారతీయ సినీ దిగ్గజం స్వర్గీయ ఎల్.వి. ప్రసాద్‌ సోదరుడు, దర్శక, కూర్పరి అక్కినేని సంజీవి తనయుడే శ్రీకర ప్రసాద్‌ (Sreekar Prasad). తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ, శ్రీకర ప్రసాద్‌ సైతం ఎడిటర్‌గా చిత్ర సీమలోకి అడుగుపెట్టారు. గడిచిన నాలుగు దశాబ్దాల కాలంలో ఆయన వివిధ భాషల్లో ఆరు వందలకు పైగా చిత్రాలకు ఎడిటర్‌గా వర్క్ చేశారు.


విశేషం ఏమంటే... శ్రీకర ప్రసాద్ తనయుడు సైతం చిత్రసీమలోనే దర్శకుడిగా రాణిస్తున్నారు. ఆస్కార్ బరిలో నిలిచి, బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ అవార్డును అందుకున్న 'ఆర్.ఆర్.ఆర్.' సినిమాకు శ్రీకర ప్రసాదే ఎడిటర్ గా ఉన్నారు. అలానే ఆయన పలు ప్రతిష్ఠాత్మక హిందీ, తమిళ చిత్రాలకు పనిచేశారు. ఈ యేడాది ఆస్కార్స్ అకాడమీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 529 మందిని కొత్తగా సభ్యులుగా తీసుకుంది. వీరందరికీ అకాడమీ అవార్డులలో ఓటు హక్కు లభిస్తుంది. ఈ జాబితాలో కూర్పరిగా విశేషమైన సేవలు అందించిన శ్రీకర ప్రసాద్‌కూ చోటు దక్కడం విశేషం.

ఇవి కూడా చదవండి:

Tollywood: పర్శంటేజ్‌ పై ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ షరతులు!

లీగల్ వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?

‘పెద్ది’ సక్సెస్ చూసి నాకు ‘ఠాగూర్’‌లోని డైలాగ్ గుర్తొచ్చింది: రామ్ చరణ్

Updated Date - Jun 25 , 2026 | 04:40 PM