Sonu Sood: ఆ దృశ్యాలు నన్ను నిద్రపోనివ్వలేదు.. సేవల వెనుక కారణం చెప్పిన సోనూసూద్!
ABN, Publish Date - Nov 15 , 2026 | 08:06 AM
కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు తనను తీవ్రంగా కలచివేశాయని నటుడు సోనూసూద్ తెలిపారు.
కోవిడ్ సమయంలో వలస కార్మికులు తమ పిల్లలతో కలిసి జాతీయ రహదారులపై నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు తనను తీవ్రంగా కలచివేశాయని, అప్పుడే చివరి వ్యక్తి కూడా తన గమ్యస్థానానికి చేరుకునే వరకు సహాయం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు నటుడు సోనూసూద్ (Sonu Sood) తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) లోని విజ్ఞాన వేదిక సింపోజియం (Vignanavedika Symposium) తమ ఏడవ ఎడిషన్‌గా శుక్రవారం రాత్రి హైటెక్ సిటీలోని ఒక లాంజ్‌లో నిర్వహించిన `ది హ్యూమానిటీ ఇన్ ఆస్ (మనలోని మానవత్వం) (Humanity in Us) చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
దీనిలో గూంజ్ వ్యవస్థాపకుడు, సామాజిక పారిశ్రామికవేత్త అనుగుప్తా, సింపోజియం చైర్మన్ గిరీష్ మాల్వాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ తనలోని మానవతా విలువలకు కుటుంబ నేపథ్యమే పునాది అని చెప్పారు. తన తల్లి ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా విద్యార్థులకు సహాయం చేసే వారని, తన తండ్రి తరచూ సామూహిక అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవారని తెలిపారు.
దాతృత్వం ముందుగా తక్షణ కష్టాలను తొలగించడంతోనే ప్రారంభం కావాలన్నారు. సంక్షేమం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, దానిపై చేసే వ్యయం ఆర్థికంగా స్థిరంగా ఉండాలని సింపోజియం చైర్మన్ శ్రీగిరీష్ మాల్సాని అభిప్రాయ పడ్డారు. గూంజ్ సంస్థ ఆవిర్భావానికి దారితీసిన తన అనుభవాలను ఆస్తు గుప్తా వివరించారు. ఈ చర్చకు ఎన్డీటీవీ మాజీ ఎగ్జిక్యూ టివ్ ఎడిటర్ (సౌత్) ఉమా సుధీర్ మోడరేటర్‌గా వ్యవహరించారు. సింపోజియం గత ఎడిషన్‌కు సంబంధించిన వైట్ పేపర్‌ను ఎస్.పి.సింగ్‌కు అందజేశారు.