సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సింగ‌ర్ దియా.. ‘అరెరే.. అరెరే’ మ్యూజిక్ వీడియో రిలీజ్‌

ABN, Publish Date - Mar 22 , 2026 | 09:51 PM

singer dia music album Arere Arere released ప్ర‌ముఖ గాయ‌ని నటి దియా స్వీయ గానంలో బటర్‌ఫ్లై మ్యూజిక్ బ్యానర్‌పై రూపొందించిన ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో విడుద‌ల చేశారు.

dia

ప్ర‌ముఖ గాయ‌ని నటి దియా స్వీయ గానంలో బటర్‌ఫ్లై మ్యూజిక్ బ్యానర్‌పై రూపొందించిన ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఆదివారం విడుద‌ల చేశారు. ఈ వేడుకకు సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై టీమ్‌కు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, హీరో పూరి ఆకాష్, సంగీత దర్శకుడు రఘు కుంచె, నటుడు మిమిక్రి శివారెడ్డి, సమీర్, సాగర్ పాల్గొన్నారు. వారు ఆడియోను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సంద‌ర్భంగా.. వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ దియా ప్రతిభను ప్రశంసించారు. ఆమె గాత్రం, నటన రెండింటిలోనూ ప్రత్యేకత ఉందని అన్నారు. ఇలాంటి కొత్త ప్రతిభలు తెలుగు సంగీత రంగానికి మంచి సంకేతమని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ డిజిటల్ యుగంలో టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు విస్తరించాయని అన్నారు. దియా ఈ పాటలో చూపించిన భావ వ్యక్తీకరణ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

దియా మాట్లాడుతూ ఈ ఆల్బమ్ రూపుదిద్దుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచిన టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ప్రేక్షకుల ఆదరణే తనకు పెద్ద బలం అని పేర్కొన్నారు. హీరో పూరి ఆకాష్ మాట్లాడుతూ దియాతో ‘మహబూబ’ సినిమాలో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె గాత్ర ప్రతిభ చూసి ఆశ్చర్యపోయానని, ఈ పాట పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు.

మిమిక్రి శివారెడ్డి మాట్లాడుతూ దియాకు టాలెంట్‌తో పాటు మంచి మనసు ఉందని అన్నారు. ఈ ఆల్బమ్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. నిర్మాత నూతన్ చెకురి మాట్లాడుతూ దియా కల ఈ ప్రాజెక్ట్ ద్వారా నెరవేరిందని తెలిపారు. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ఆల్బమ్ ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

దర్శకుడు క్రాంతి వర్మ మాట్లాడుతూ భావోద్వేగాలతో కూడిన విజువల్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ సాంగ్ రూపొందించామని తెలిపారు. దియా అద్భుత సహకారం అందించిందని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ మాట్లాడుతూ టీమ్ మొత్తం కృషితో ఈ పాట ఎంతో అందంగా వచ్చిందని చెప్పారు.

ఈ మ్యూజిక్ వీడియోకు క్రాంతి వర్మ దర్శకత్వం వహించగా, కె & ఎం రైటింగ్స్ కథ అందించారు. నిర్మాతగా నూతన్ చెకురి, సంగీతాన్ని శరవణ వాసుదేవన్ సమకూర్చారు. డీఓపీగా చందు ఏజే, ఎడిటర్‌గా ఆర్.ఎం. విశ్వనాథ్ కుచనపల్లి పనిచేశారు. త్వరలోనే ఈ మ్యూజిక్ వీడియో యూట్యూబ్‌తో పాటు స్పాటిఫై, ఆపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో విడుదల కానుంది.

Updated Date - Mar 23 , 2026 | 06:10 AM