యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్లకు షాక్.. మానిటైజేషన్‌కు కొత్త నిబంధనలు

ABN , Publish Date - Aug 12 , 2026 | 08:21 AM

యూట్యూబ్ మానిటైజేషన్ కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్తగా YPPలో చేరే క్రియేటర్లు 8 వేల గంటల వాచ్ టైమ్ లేదా 90 రోజుల్లో 2 కోట్ల షార్ట్స్ వ్యూస్ సాధించాల్సి ఉంటుంది.

youtube

యూట్యూబ్ (You Tube)లో కంటెంట్ క్రియేటర్లుగా మారి ఆదాయం పొందాలనుకునే వారికి ఆ సంస్థ షాకిచ్చింది. మానిటైజేషన్ (YouTube Monetization) కోసం అర్హత పొందేందుకు ఇకపై రెట్టింపు వ్యూస్ సాధించాలనే నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం, కొత్తగా కంటెంట్ క్రియేటర్లుగా చేరే వారు ఏడాది వ్యవధిలో కనీసం 8వేల గంటల వాచ్ టైమ్ లేదా 90 రోజుల్లో 20 మిలియన్ల షార్ప్ వ్యూస్ సాధిస్తేనే మానిటైజేషను అర్హత పొందుతారు. ప్రస్తుతం ఇది ఏడాది వ్యవధిలో 4వేల గంటల వాల్టైమ్ లేదా 10 మిలియన్ల షార్ప్ వ్యూస్ ఉంది.

అయితే ఇప్పటికే యూట్యూట్ పార్ట్ నర్ ప్రోగ్రామ్ (వైపీపీ)లో భాగస్వాములుగా ఉన్న క్రియేటర్లకు కొత్త నిబంధన వర్తించదని సంస్థ పేర్కొంది. కొత్తగా వైపీపీ(YPP)లో చేరే వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ప్లాట్ఫామ్‌పై నిత్యం అంత‌కంత‌కు అంచ‌నాల‌ను మించి పోటీ పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన కంటెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. వెయ్యి మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉండాలనే నిబంధనలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. కొత్త నిబంధన 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

యూట్యూబ్‌లో వినియోగం, కంటెంట్ పరిమాణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం తమ ప్లాట్‌ఫామ్‌పైరోజూ 200 బిలియన్లకు పైగా షార్ట్స్ వ్యూస్ (YouTube Shorts) నమోదవుతున్నాయని, టీవీల్లో ప్రతిరోజూ 100 కోట్ల గంటలకు పైగా వాచ్‌టైమ్ నమోదవుతోందని వివరించింది. ఇక తమ ప్రీమియం లైట్స‌ (Premium Lite) సబ్ స్క్రిప్షన్ సేవలను మరిన్ని దేశాలకు విస్తరిస్తున్నట్లు యూట్యూబ్ పేర్కొంది.

Updated Date - Aug 12 , 2026 | 08:21 AM