సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శివ కందుకూరి పెళ్లి ముహూర్తం ఫిక్స్...

ABN, Publish Date - Nov 24 , 2026 | 12:43 PM

హీరో శివ కందుకూరి, శిశిర సింహా జయంతి వివాహం డిసెంబర్ 2న హైదరాబాద్‌లో జరగనుంది. రాత్రి 7 గంటలకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని కన్వెన్షన్ సెంటర్‌లో పెళ్లి వేడుక నిర్వహించనున్నారు.

Shiva Kandukuri

సద్గురు శివానంద మూర్తి మనవడు, రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి వివాహం నిశ్చయమైన విషయం తెలిసింది. శిశిర సింహా జయంతితో తన పెళ్ళి జరుగబోతున్నట్టుగా నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియా ద్వారా శివ కందుకూరి తెలిపాడు. తాజాగా అతని వివాహం డిసెంబర్‌ 2వ తేదీ రాత్రి 7.00 హైదరాబాద్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్ లోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరుగబోతున్నట్టు తెలిసింది.


నిర్మాత రాజ్‌ కందుకూరి కుమారుడైన శివ కందుకూరి 'చూసి చూడంగానే' చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాలలోనూ, వెబ్ సీరిస్‌లోనూ నటించాడు. ఈ యేడాది అతను హీరోగా నటించిన 'నవాబ్‌ కేఫ్‌' మూవీ విడుదలైంది. 'టాల్కమ్‌ పౌడర్‌' మూవీ విడుదల కావాల్సి ఉంది. ఈ న్యూ ఏజ్‌ క్రైమ్ డ్రామెడీ సినిమాను సాయినాథ్‌ పొన్నా డైరెక్ట్ చేశారు. ద్రిషికా చందర్ ఇందులో హీరోయిన్‌గా నటించింది. రాజ్‌ కందుకూరి నిర్మించిన ఈ సినిమాకు ఓషో వి సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి:

‘దేవర’కు గ్రహణం వీడింది.. బుల్లితెరకు వచ్చే సమయం ఆసన్నమైంది

ఈ ‘ఆలోచన’ నిజంగా ఒక మంచి ఆలోచన: చిరంజీవి

Sampath Nandi: ఇప్పటివరకు శర్వా బెస్ట్ చూశారు.. ఇక బీస్ట్ చూస్తారు

Updated Date - Nov 24 , 2026 | 01:29 PM