సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నటుడు శివాజీరాజా తండ్రి కన్నుమూత

ABN, Publish Date - Mar 03 , 2026 | 09:36 AM

సీనియర్ నటుడు శివాజీరాజా తండ్రి జి. రామరాజు అనారోగ్యంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. రామరాజు మనవడు విజయ్ రాజా కూడా తెలుగులో పలు చిత్రాలలో నటిస్తున్నాడు.

Shivaji Raja Father Ramaraju

సీనియర్ నటుడు శివాజీ రాజా (Shivaji Raja) తండ్రి జి. రామరాజు (85) గారు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం 8 గంటలకు మధురానగర్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల లోపుగా జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న శివాజీ రాజా కుటుంబానికి సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. రామరాజు తనయుడు శివాజీరాజానే కాకుండా మనవడు విజయ్ రాజా (Vijay Raja) కూడా నటుడిగా తెలుగు సినిమాల్లో రాణిస్తున్నాడు.

Updated Date - Mar 03 , 2026 | 09:38 AM