సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సామ్... పడిలేచిన కడలి తరంగం!

ABN, Publish Date - Feb 23 , 2026 | 06:29 PM

మార్చి నెల ఓగ్ మేగజైన్ కవర్‌పై స్టార్ హీరోయిన్ సమంత మెరిసింది. ఆ పత్రిక కోసం ఆమె ప్రత్యేకంగా ఫోటో షూట్ చేసింది. తన జీవితానుభవాలను ఆమె ఈ సందర్భంగా వెల్లడించింది.

Samantha

ఇప్పుడు సమంత కేవలం స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు... నిర్మాత కూడా. ఆమె నిర్మించిన 'శుభం' చిత్రం గత యేడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడిప్పుడే సమంత వైవాహిక జీవితం కూడా ఓ గాటన పడుతోంది. ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత సమంత మరింత ఉత్సాహంగా తన ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెడుతోంది. తాజాగా సమంత వోగ్ ఇండియా ష్యాషన్ మేగజైన్ కవర్‌పై మెరిసింది. మార్చి నెల పత్రిక కోసం సమంత స్పెషల్‌గా ఫోటో షూట్ చేసింది.


వోగ్ మేగజైన్ కోసం చేసిన ఈ ఫోటో షూట్‌లో సమంత రెండు భిన్నమైన లుక్స్‌లో దర్శనమిచ్చింది. ఆరెంజ్ కలర్ సెమీ మోడ్రన్ డ్రస్‌లో స్టైలిష్‌ గానూ, బ్లాక్ టైట్ ఫిట్ డ్రెస్‌లో అందుకు భిన్నంగానూ సమంత కనిపించింది. విశేషం ఏమంటే... సింపుల్ మేకప్‌తో, నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సమంత చూడముచ్చటగా ఉంది. గ్లామర్ కంటే కూడా గ్రేస్‌కు ఆమె ఈ ఫోటో షూట్‌లో ప్రాధాన్యమిచ్చినట్టు అర్థమౌతోంది.


ఈ ఫోటో షూట్ సందర్భంగా సమంత తన మనసులో మాటలను వ్యక్తం చేసింది. 'జీవితంలో ఒకసారి వివాహ బంధం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవరితో స్నేహంగా ఉండాలో, ఎవరికి ప్రేమను పంచాలో అర్థం కాని పరిస్థితులకు తాను లోనయ్యానని, అలాంటి సమయంలోతన జీవితంలోకి అడుగు పెట్టిన రాజ్ నిడిమోరు సాయంతో తిరిగి మామూలు మనిషిని కాగలిగాన'ని సమంత తెలిపింది. విడాకులు, అనారోగ్యం, ఊహించని పరాజయాలు ఇవన్నీ తనని కృంగదీశాయని, వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళడం కోసం తాను స్ట్రాంగ్ గా తయారయ్యానని చెప్పింది. ఇప్పుడు తనపై ప్రశంసలు, విమర్శలు పెద్దంత ప్రభావం చూపించవని సమంత అంటోంది. అనారోగ్యం నుండి బయట పడటం కోసం యోగాను తాను సాధన చేశానని, సరైన ఆహారం, సమయానికి వ్యాయామం చేయడంతో తిరిగి సత్తువ పొందానని చెప్పింది. ఏదేమైనా సామ్... సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ అని ఆమెను దగ్గరగా చూసిన వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే... ఈ యేడాది మే 15న సమంత నటించి, నిర్మించిన 'మా ఇంటి బంగారం' మూవీ విడుదల కాబోతోంది. ఈ సినిమాకు నందినీ రెడ్డి దర్శకురాలు కాగా రాజ్ నిడిమోరు సైతం క్రియేటివ్ సైడ్ తన వంతు సహకారం అందించారు.

Updated Date - Feb 23 , 2026 | 06:38 PM