పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ మొదటి చిత్రం.. రెహ్మాన్ ఫస్ట్ లుక్
ABN, Publish Date - May 24 , 2026 | 10:52 AM
తెలుగు, తమిళ మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన నటుడు రషీన్ రహమాన్.
తెలుగు, తమిళ మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన నటుడు రషీన్ రహమాన్. 1987లో 'రాగలీల' సినిమాతో పరిచయమై 'భారత్ బంద్', 'ప్రియతమా', 'బిల్లా', 'సింహ' వంటి సినిమాల్లో తనదైన శైలి లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. మే 23న ఆయన పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఆయన నటిస్తున్న కొత్త చిత్రం పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ తొలి చిత్రం నుంచు ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ద్వారా ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని, అందులోని మిస్టరీని ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. రెహమాన్. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.