సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్రశ్నించడం అంటే ఇదేనా? రావణ్‌పై రామ్ తాళ్లూరి ఫైర్

ABN, Publish Date - Jul 05 , 2026 | 02:25 PM

కొన్ని రోజులుగా వార్తలలో హైలెట్ అవుతోన్న యూట్యూబర్ రావణ్‌ పై నిర్మాత, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి ఫైర్ అయ్యారు. ప్రశ్నిస్తానంటూ వచ్చి.. ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేయడం, హిందూ దేవతలను దూషించడం వంటివి ప్రశ్నించడమా? అంటూ ఆయన ప్రశ్నించారు.

Ram Talluri and Raavan

కొన్ని రోజులుగా వార్తలలో హైలెట్ అవుతోన్న యూట్యూబర్ రావణ్‌ (Raavan)పై నిర్మాత, జనసేన పార్టీ (Janasena Party) జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి (Ram Talluri) ఫైర్ అయ్యారు. ప్రశ్నిస్తానంటూ వచ్చి.. ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేయడం, హిందూ దేవతలను దూషించడం వంటివి ప్రశ్నించడమా? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చీడపురుగులు సమాజంలో తిరగకుండా ప్రజలు, ముఖ్యంగా ప్రతి హిందువు ఆలోచించాలని ఆయన కోరారు. ప్రస్తుతం రావణ్‌పై రోజుకో కేసు నమోదవుతూ.. 4 కేసులు, 3 బెయిల్‌లు అన్నట్లుగా జర్నీ నడుస్తోంది. తాజాగా రావణ్‌పై రాజద్రోహం కేసు కూడా నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో రావణ్‌పై రామ్ తాళ్లూరి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.


‘‘ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తున్నారా? ఏం ప్రశ్నించాడు? ఎవరిని ప్రశ్నించాడు? ఏ సమస్యపై ప్రశ్నించాడు? వంద కోట్లకు పైగా హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుల వారిని బూతులు తిట్టడమా? నా ఆరాధ్య దైవం శ్రీరాముడిని అవహేళన చేస్తే దాన్ని ప్రశ్నించడం అంటారా? హిందువులను అవమానించేలా మాట్లాడటమా? హిందువుల సంక్షేమం కోసం, హైందవ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తూ ప్రజా సేవలో ఉండే ఆర్ఎస్ఎస్‌ను తీవ్రవాద సంస్థ అనడం ప్రశ్నించడమా? మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జోసెఫ్ అనే పేరును దాచిపెట్టి, రాక్షసుడైన రావణ్ పేరుతో హిందువులపై విషం కక్కడమా? ఆడవారి గురించి లైవ్‌లు పెట్టడం ప్రశ్నించడమా?


సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిల ఫోటోలు లైవ్‌లో చూపించి ముద్దులు పెట్టుకోవడం ప్రశ్నించడమా? కులాన్ని, మతాన్ని దాచిపెట్టి సమాజంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రశ్నించడమా? వందలాది భద్రతా బలగాల ప్రాణాలు తీసిన మావోయిస్టు హిడ్మాను వెనకేసుకొస్తూ దేశ భద్రతను తాకట్టు పెట్టడం ప్రశ్నించడమా? చేసిన తప్పులకు అరెస్ట్ అయితే, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ‘జై భీమ్’ నినాదాలు చేస్తూ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ స్ఫూర్తిని తుంగలో తొక్కడం ప్రశ్నించడమా? ఇలాంటి వ్యక్తిని సమాజం సమర్థించాలా? ఇలాంటి చీడపురుగులు సమాజంలో తిరగకుండా ప్రజలు, ముఖ్యంగా ప్రతి హిందువు ఆలోచించాలి.

ఇవి కూడా చదవండి:

Spirit: ‘స్పిరిట్‌’ పరుగులే.. సందీప్‌ వంగా స్పీడ్‌కు ఫ్యాన్స్ హ్యాపీ!

ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’.. ఎప్పుడంటే

సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్ కాంబోకి బ్రేక్? కారణమిదేనా?!

Updated Date - Jul 05 , 2026 | 02:35 PM