సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

యువతి అత్యుత్సాహం.. తిరుమల నడక మార్గంలో 'పెద్ది' ఫ్లెక్సీ

ABN, Publish Date - Jul 23 , 2026 | 03:48 PM

తిరుమల అలిపిరి నడకమార్గంలో రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ఫ్లెక్సీ ప్రదర్శించడంపై వివాదం చెలరేగింది.

Peddi

తిరుమల నడకమార్గంలో ఓ యువతి రామ్ చ‌రణ్ (Ram Charan) తాజా చిత్రం పెద్ది (Peddi) ఫ్లెక్సీని ప్రద ర్శించడం వివాదం రేపింది. సాధారణంగా తిరుమల (Tirumala) పరిసరాల్లో, నడకదారుల్లో రాజకీయాలు, సినిమాలు, వ్యాపారాలకు సంబంధించిన ఫ్లెక్సీలను ప్రదర్శించడం నిషేధం.

కానీ.. మంగళవారం ఓ యువతి పెద్ది సినిమా ఘన విజయాన్ని సాదించిన సందర్భంగా తిరుమల కాలినడక అనే పేరుతో ఫ్లెక్సీని అలిపిరి పాదాల మండపం వద్ద ప్రదర్శించింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. యువతి అత్యుత్సాహం ప్రదర్శించినా భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Updated Date - Jul 23 , 2026 | 05:05 PM