సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పల్లె అందాల్లో ప్రేమకథ.. ఫస్ట్ లుక్ అదుర్స్

ABN, Publish Date - Aug 10 , 2026 | 10:14 PM

ప్రేమ, అనుబంధాలు, భావోద్వేగాలకు అందమైన పల్లె నేపథ్యాన్ని జోడిస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. 

ప్రేమ, అనుబంధాలు, భావోద్వేగాలకు అందమైన పల్లె నేపథ్యాన్ని జోడిస్తూ తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమనే ఊరిలో’‘Welcome to the Land of Love’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. పచ్చని పొలాలు, గాలిమరలు, ఎడ్లబండి, ప్రశాంతమైన పల్లె వాతావరణం పోస్టర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రేమను, పల్లె అందాలను కలిపి చూపించిన ఈ ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రేమ, భావోద్వేగాలు, మానవ సంబంధాలతో పాటు పల్లె జీవనశైలిని ప్రతిబింబించే కథగా ‘ప్రేమనే ఊరిలో’ రూపొందుతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాకు ప్రతిభావంతమైన సాంకేతిక బృందం పనిచేస్తోంది. ‘కేజీఎఫ్’, ‘కాంతారా’ వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ‘ప్రేమనే ఊరిలో’ చిత్రానికి సంభాషణలు రాశారు.  

Updated Date - Aug 10 , 2026 | 10:47 PM