సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పోలీస్ కంప్లైంట్.. ఆక‌ట్టుకుంటోంది! ఘ‌నంగా సక్సెస్ సెలబ్రేషన్స్

ABN, Publish Date - Jun 14 , 2026 | 06:32 PM

వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’.

Police Complaint

వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ పతాకంపై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు.

సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకలను నిర్వహించింది. కేక్ కట్ చేసి సినిమా విజయాన్ని ఆనందంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, సినిమా ప్రమోషన్‌కు సంబంధించి హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్, చిత్రబృందం మధ్య ఏర్పడిన వివాదం పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కారమైందని తెలిపారు. దర్శకుడు సంజీవ్ మేగోటి ప్రదర్శించిన వినయం, సహనమే చిత్ర విజయానికి కూడా తోడ్పడిందని ఆయన పేర్కొన్నారు. మంచి కలెక్షన్లతో సినిమా ముందుకు సాగడం పరిశ్రమకు శుభపరిణామమని అభిప్రాయపడ్డారు.

దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, కొన్ని విభేదాలు ఎదురైనా చివరికి సినిమా విజయవంతంగా ప్రేక్షకుల ఆదరణ పొందడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని, రెండో రోజు నుంచి థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతోందని వెల్లడించారు.

దర్శకుడు, రచయిత, సంగీత దర్శకుడిగా ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పిన ఆయన, సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రేక్షకులు సంతృప్తిగా థియేటర్ల నుంచి బయటకు రావడం తమకు పెద్ద విజయంగా భావిస్తున్నామని చెప్పారు.

కేవలం 45 రోజుల్లో 52 మంది సీనియర్ కళాకారులతో చిత్రీకరణ పూర్తి చేశామని, ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వినూత్న కాన్సెప్ట్ ఆధారంగా హారర్, థ్రిల్లర్, యాక్షన్ అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సంజీవ్ మేగోటి తెలిపారు.

హీరో కృష్ణసాయి మాట్లాడుతూ, ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసే ప్రత్యేక గీతంలో నటించడం తనకు మధుర అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. కుటుంబ సమేతంగా చూసే వినోదాత్మక చిత్రంగా ‘పోలీస్ కంప్లైంట్’ నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 10:29 PM