‘ఆదర్శ కుటుంబం’.. సంపూర్ణగా యువినా పార్థవి

ABN , Publish Date - Jul 29 , 2026 | 11:49 AM

విక్టరీ వెంకటేష్ ‘చిట్టిబాబు’గా, శ్రీనిధి శెట్టి ‘స్వర్ణ’గా నటిస్తోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47’. ఈ సినిమా నుంచి మరో పాత్రని మేకర్స్ పరిచయం చేశారు.

Yuvina Parthavi in AK47

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ‘చిట్టిబాబు’గా, శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ‘స్వర్ణ’గా నటిస్తోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47’ (Aadarsha Kutumbam House No: 47 – AK47). ఇప్పటికే విడుదలైన చిట్టిబాబు, స్వర్ణ పాత్రల పరిచయ వీడియోలు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందిన విషయం తెలిసిందే. తాజాగా చిత్ర బృందం ఈ ‘ఆదర్శ కుటుంబం’లోని మరో సభ్యురాలిని పరిచయం చేసింది. ఈ చిత్రంలో చిట్టిబాబు, స్వర్ణ దంపతుల ముద్దుల కుమార్తె ‘సంపూర్ణ’ పాత్రలో బాలనటి యువినా పార్థవి (Yuvina Parthavi) నటిస్తోంది. ఆమె పాత్రకు సంబంధించిన పరిచయ వీడియోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.


ఈ వీడియోను గమనిస్తే.. అమాయకత్వం, చిలిపితనం, అల్లరితో నిండిన సంపూర్ణ పాత్ర చిట్టిబాబు జీవితంలో నవ్వులు పూయించడంతో పాటు, అనూహ్యమైన చిన్న చిన్న సంఘటనలకు కూడా కారణమవుతుందనే విషయం ఈ గ్లింప్స్ తెలియజేస్తోంది. ఈ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉండనుందని చిత్ర బృందం కూడా ప్రకటించింది. పాత్రల పరిచయాలతో సినిమాపై రోజురోజుకూ ఆసక్తిని పెంచుతున్న మేకర్స్, తదుపరి ‘సర్వ’ పాత్రలో నటిస్తున్న రాజా ప్రజ్వల్‌ను పరిచయం చేయనున్నారు.


త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలోకి తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నారా రోహిత్ ఓ కీలక పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

చిత్ర పరిశ్రమ నాకు నేర్పింది ఇదే: శ్రుతి హాసన్ సంచలన వ్యాఖ్యలు

నేడు నటి పావలా శ్యామల అంత్యక్రియలు

Naga Chaitanya: ప్రేమకథలు తగ్గిపోయాయని బాధపడ్డా..

Updated Date - Jul 29 , 2026 | 11:49 AM